ETV Bharat / city

మంత్రి బొత్సపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం.. - మంత్రి వ్యాఖ్యలపై ఉపాధ్యాయుల ఆగ్రహం

ఏపీలో ప్రభుత్వ విధాన నిర్ణయాలను ఉపాధ్యాయులు ప్రశ్నించకూడదని మంత్రి బొత్స సత్యనారాయణ అనడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. చర్చల సందర్భంగా విలీనాన్ని ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించాయని ఆయన చేసిన ప్రకటననూ ఖండించాయి. ఉపాధ్యాయ సంఘాల సూచనలకు ప్రభుత్వం అంగీకరించనందునే ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందన్నాయి.

ఉపాధ్యాయులు
ఉపాధ్యాయులు
author img

By

Published : Jul 27, 2022, 12:56 PM IST

ఆంధ్రప్రదేశ్​లో ప్రభుత్వ విధాన నిర్ణయాలను ఉపాధ్యాయులు ప్రశ్నించకూడదని మంత్రి బొత్స సత్యనారాయణ అనడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. చర్చల సందర్భంగా విలీనాన్ని ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించాయని ఆయన చేసిన ప్రకటననూ ఖండించాయి. ఉపాధ్యాయ సంఘాల సూచనలకు ప్రభుత్వం అంగీకరించనందునే ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందన్నాయి. అడ్డంకులున్నా అధికారులు అత్యుత్సాహంతో విలీనం చేస్తున్నారని, ఉన్నత పాఠశాలల్లో సౌకర్యాలు లేకుండా విలీనం చేయడాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకిస్తుంటే 5వేల పాఠశాలలకు 400 బడుల్లోనే సమస్య ఉందని మంత్రి ప్రకటించడం సరికాదని వెల్లడించాయి.

ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదనడం మంత్రి అవివేకం: రమేష్‌ పట్నాయక్‌
ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు విద్యారంగం గురించి మాట్లాడకూడదని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదని మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడడం చాలా అవివేకమని విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ రమేష్‌ పట్నాయక్‌ విమర్శించారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయులు తమ జీతభత్యాల సమస్యలతోపాటు విద్యారంగ సమస్యలపైనా మాట్లాడటం సాధారణ విషయం. ఉపాధ్యాయుడు కూలీ తీసుకునే జీతగాడు కాదు. వాళ్ల జీవితం విద్యారంగంతో మమేకమై ఉంటుంది. ఉపాధ్యాయులూ పౌరులే. వారికి ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు ఉంటుంది’ అని వెల్లడించారు.

మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం: యూటీఎఫ్‌
పాఠశాలల విలీనంపై ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నించకూడదని, మార్పులపై మాట్లాడకూదని మంత్రి బొత్స సత్యనారాయణ అనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఐక్య ఉపాధ్యాయ సంఘం (యూటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ వెల్లడించారు. ‘ఈ విద్యా సంవత్సరంలో కిలోమీటరు దూరంలోని పాఠశాలలను విలీనం చేస్తామని, సహజ అడ్డంకులు లేనిచోట విలీనం చేయబోమని మంత్రి హామీ ఇచ్చారు. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా చేశారు. ఉపాధ్యాయ సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకుని ఉంటే రాష్ట్రంలో మెరుగైన విద్యా విధానం అమలయ్యేది. అంగీకరించనందునే ఉద్యమబాట పట్టాల్సిన వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమయ్యే విధానాన్ని అవలంబించాలి’ అని పేర్కొన్నారు.

విలీనాన్ని అంగీకరించారని మంత్రి చెప్పడం అబద్ధం: ఫ్యాప్టో
ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీలు ఏవీ ఆచరణలోకి రాలేదని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, మంజుల అన్నారు. ‘పాఠశాలల విలీనం, ఒకే మాధ్యమం అనే అంశాలు తమ ప్రభుత్వ విధానంలో భాగమని, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై చర్చిద్దామని చర్చల్లో మంత్రి తెలిపారు. కానీ, మేము విలీనం ఆపాలని, తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు కొనసాగించాలని డిమాండు చేశాం. ఉపాధ్యాయ సంఘాలు విలీనానికి అంగీకరించాయని మంత్రి చెప్పడం సరికాదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పాఠశాలల విలీనాన్ని విరమించాలి. తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేయాలి. హేతుబద్ధీకరణ ఉత్తర్వులు రద్దుచేయాలి’ అని డిమాండు చేశారు.

విలీనంతో విద్యా రంగానికి తీవ్ర నష్టం: ఏపీటీఎఫ్‌
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల భాగస్వామ్యం లేకుండా అమలుచేస్తున్న తరగతుల విలీనం వల్ల విద్యారంగానికి తీవ్రనష్టం జరుగుతుందని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంజు, భానుమూర్తి వెల్లడించారు. ‘విద్యారంగానికి హానికలిగించే విలీనాన్ని అడ్డుకునే హక్కు ఉపాధ్యాయులకు ఉంటుంది. జాతీయ విద్యా విధానంలో ఎక్కడా పాఠశాలలను విడదీయాలని చెప్పలేదు. ఉపాధ్యాయ పోస్టులను మిగుల్చుకోడానికే ఈ విధానానికి ప్రభుత్వం పూనుకుంది. విలీనం, హేతుబద్ధీకరణ వల్ల లక్షలమంది విద్యార్థులు ప్రభుత్వ బడిని వదిలి ప్రైవేటుకు వెళ్లిపోయారు’ అని తెలిపారు.

కామన్‌ పాఠశాల విధానాన్ని తీసుకురావాలి: టీఎన్‌యూఎస్‌
ప్రైవేటు పాఠశాలలను రద్దుచేసి, కామన్‌ పాఠశాల విధానాన్ని తీసుకొస్తే అందరూ పిల్లలు ప్రభుత్వ బడుల్లోనే చదువుతారని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం(టీఎన్‌యూఎస్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రతి తరగతికీ ఒక ఉపాధ్యాయుడు ఉండాలని, దీన్ని అమలు చేయకపోవడం వల్లనే విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లిపోతున్నారని వెల్లడించారు. ఉపాధ్యాయులు విధాన నిర్ణయాలు వద్దంటున్నారని చెబుతున్న మంత్రి బొత్స ఉపాధ్యాయులు ఏ నిర్ణయం అమలు చేయలేదో చెప్పగలరా? అని ప్రశ్నించారు.

సమస్యను పరిష్కరించమని కోరడమే నేరమా: నోబుల్‌ టీచర్స్‌
విద్యాశాఖలో సమస్యలు సృష్టించినవారిని.. వాటిని పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరడం ఘోరమా? నేరమా? ప్రశ్నిస్తుంటే దాడులా? అని నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మూకల అప్పారావు, వెంకట్రావు ప్రశ్నించారు. ‘ఉపాధ్యాయ సంఘాలు సంస్కరణలకు అంగీకరించాయని, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాయంటూ ఎదురుదాడి చేయడం మంత్రికే చెల్లింది. ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తూ వారిచ్చే సూచనలు పెడచెవిన పెట్టడం ప్రభుత్వానికి సాధారణంగా మారిపోయింది’ అని విమర్శించారు.

ఇవీ చదవండి: విద్యార్థులకు ప్రలోభాల వల.. రూ.5 వేలు ఇస్తామని ఎర.. ప్రైవేట్‌ కళాశాలల పాట్లు

భాజపా యువనేత దారుణ హత్య.. నిందితుల్ని వదిలిపెట్టబోమని సీఎం ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.