తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తన కుటుంబసభ్యులతో కలిసి టూర్ వేసినట్లు.. 4రోజుల అనంతరం తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి పట్టాభి మాల్దీవులు వెళ్లినట్లు కనిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయం గురించి ఇంతవరకు కుటుంబసభ్యుల నుంచి, తెదేపా వర్గాల నుంచి ఎటువంటి సమాచారం కూడా అధికారికంగా వెలువడలేదు.
ఏపీ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బుధవారం( అక్టోబర్ 20) అరెస్టైన పట్టాభి.. శనివారం (అక్టోబర్ 23) సాయంత్రం రాజమహేంద్రవరం కారాగారం నుంచి బెయిల్పై విడుదలయ్యారు. అక్కడి నుంచి విజయవాడ వస్తుండగా పొట్టిపాడు టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న వాహనాలను నిలిపేశారు. ఆ తర్వాత పట్టాభిరామ్ ఎవరికీ కనిపించలేదు.
ఇదీ చూడండి: Tdp Spokesperson Pattabhi: అజ్ఞాతంలో పట్టాభి... పోలీసులు మళ్లీ అరెస్టు చేస్తారనేనా !