TDP MLA Ganta wrote letter to Speaker : ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాంకు తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ గతేడాది ఫిబ్రవరిలో స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసినా.. ఇప్పటికీ సభాపతి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తక్షణం తన రాజీనామా ఆమోదించాలని కోరారు.
ఏడాదికి పైగా కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చర్యలు చేపట్టలేదని ఆయన లేఖలో ఆరోపించారు.