Tdp And Aidwa Leaders Protest: నివాసాల మధ్యలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్లో ఏర్పాటు చేసిన దిల్ ఖుష్ బార్ అండ్ రెస్టారెంట్‌ను తొలగించాలని తెదేపా, ఐద్వా మహిళా సంఘాల నేతలు నిరసనకు దిగారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు చెందిన మద్యం దుకాణం కావటంతో భారీగా పోలీసులను మోహరించారు.
ఆందోళనకు దిగిన మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించారు. దీంతో అజిత్‌సింగ్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల పహారా మధ్యలో బ్రాందీ షాపు నిర్వహించడం సిగ్గుచేటని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: ఏం స్వామి బాగున్నావా... ఫ్లోరైడ్ బాధితుడి ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్
సారా అక్రమార్కుల అతితెలివి.. పోలీసులకు చిక్కకుండా నదిలో లిక్కర్ సీసాలు దాచి..