ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడలోని స్వర్ణప్యాలెస్ కొవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం కేసులో నిందితులను.. మంగళవారం మచిలీపట్నంలోని ప్రత్యేక సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆసుపత్రి సిబ్బంది ముగ్గురికి.. విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు ఆసుపత్రి, హోటల్ యాజమాన్యాలను విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: మారని బడా ఆస్పత్రుల తీరు.. డిపాజిట్ కడితేనే ఎవరికైనా పడక