ETV Bharat / city

పీవీ ఘాట్​ వద్ద వాణీదేవి నివాళులు.. నేడు నామినేషన్ దాఖలు

హైదరాబాద్​-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి సురభి వాణీదేవీ... పీవీ ఘాట్​లో నివాళులు అర్పించారు. అనంతరం ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.

surabhi vani devi pay tributes to pv narsimharao
పీవీకి సురభి వాణీదేవి నివాళులు.. ప్రగతి భవన్​లో సీఎంతో భేటీ
author img

By

Published : Feb 22, 2021, 9:32 AM IST

Updated : Feb 22, 2021, 10:10 AM IST

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్​నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం తన తండ్రి, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సమాధి వద్దకు వెళ్లి ఆమె నివాళులు అర్పించారు. ఆమె వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. పీవీకి సరైన గౌరవం ఇవ్వాలంటే వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మంత్రి తలసాని కోరారు. ఇతర పార్టీలు అభ్యర్థులను నిలపకుండా ఏకగ్రీవానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పీవీకి సురభి వాణీదేవి నివాళులు.. నేడు నామినేషన్ దాఖలు

నివాళులు అర్పించిన అనంతరం వాణీదేవి ప్రగతి భవన్​ వెళ్లి.. ముఖ్యమంత్రి కేసీఆర్​తో భేటీ అయ్యారు. నామినేషన్ వేసినప్పటి నుంచే విస్తృతంగా ప్రచారం చేసేలా తెరాస ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఇదీ చూడండి: మేయర్​, డిప్యూటీ మేయర్​ల బాధ్యత స్వీకరణ నేడే...

Last Updated : Feb 22, 2021, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.