ETV Bharat / city

సస్పెన్షన్ కేసులో కౌంటర్ దాఖలు చేయండి.. ఏపీ సర్కారుకు సుప్రీం ఆదేశం

ఏపీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రివ్యూ కమిటీ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు 3 రోజుల గడువు కావాలని ఏబీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ మేరకు కోర్టు అనుమతి ఇస్తూ.. తదుపరి విచారణను మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. మూడు రోజుల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

author img

By

Published : Mar 2, 2021, 7:28 PM IST

సస్పెన్షన్ కేసులో కౌంటర్ దాఖలు చేయండి.. ఏపీ సర్కారుకు సుప్రీం ఆదేశం
సస్పెన్షన్ కేసులో కౌంటర్ దాఖలు చేయండి.. ఏపీ సర్కారుకు సుప్రీం ఆదేశం

ఏపీ ఇంటెలిజెన్స్​ మాజీ చీఫ్​, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. ఏడాది నుంచి సస్పెన్షన్ పొడిగింపుపై సర్వీస్ నిబంధనలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. రూల్-3లో 1-సీ కింద సస్పెన్షన్‌ పొడిగించామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు 6 నెలల తర్వాత సస్పెన్షన్ పొడిగించామని తెలిపారు. ఏడాది కంటే ఎక్కువ సస్పెన్షన్ ఉంచేందుకు వీల్లేదని ఏబీ తరఫు న్యాయవాది వాదించారు.

కమిటీ ఆదేశాలను ఎందుకు సవాలు చేయలేదని ఏబీ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. కమిటీ ఆదేశాలను సవాల్ చేసేందుకు 3 రోజుల గడువు కావాలని ఏబీ తరపు న్యాయవాది కోరారు. ఈ మేరకు కోర్టు అనుమతి ఇచ్చింది. తర్వాతి 3 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: ముందస్తు ఎన్నికల పిటిషన్​ను కొట్టేసిన ధర్మాసనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.