ETV Bharat / city

Suhasini case: సుహాసిని కేసులో మరో ట్విస్ట్​.. తెరపైకి రెండో భర్త - తిరుపతి నేర వార్తలు

తిరుపతిలో చర్చనీయాంశంగా మారిన నిత్య పెళ్లి కూతురు సుహాసిని(Suhasini case) కేసు మరో మలుపు తిరిగింది. సుహాసిని వల్ల నష్టపోయానంటూ ఆమె రెండో భర్త.. వినయ్(vinay) మీడియా ముందుకు వచ్చాడు. తన దగ్గర నుంచి, తన బంధువుల దగ్గర నుంచి డబ్బు, బంగారం తీసుకుని సుహాసిని ఉడాయించినట్లు తెలిపాడు.

bride
bride
author img

By

Published : Jun 13, 2021, 8:40 PM IST

భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వినయ్​కు 2018లో సుహాసినితో పరిచయం ఏర్పడింది. తాను అనాథనని, ప్రేమించానని చెప్పడంతో 2019లో పెళ్లి చేసుకున్నట్లు వినయ్(vinay) తెలిపాడు. వివాహం చేసుకున్న కొద్ది రోజులకే సుహాసిని ప్రవర్తన సరిగా లేకపోగా.. తనకు తెలియకుండా తన బంధువుల నుంచి డబ్బులు తీసుకోవటం గమనించానని చెప్పాడు.

సుహాసిని మొదటి భర్త వెంకటేశ్వర్లు, ఆమె ఇద్దరు పిల్లలను ఇంటికి పిలిపించి బంధువులుగా పరిచయం చేసినట్లు వినయ్ వెల్లడించారు. తన బంధువుల దగ్గర నుంచి తీసుకువచ్చిన రూ.పది లక్షలతో పాటు.. రూ.5 లక్షల విలువైన బంగారం తీసుకుని సుహాసిని(suhasini) పారిపోయినట్లు చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. వారు పట్టించుకోకపోవడంతో.. ఆమె మోసాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో సుహాసిని తిరుపతిలో మూడో పెళ్లి చేసుకున్న విషయం వెలుగులోకి రావడంతో ఈ వివరాలు వెల్లడిస్తున్నట్లు బాధితుడు వినయ్ తెలిపాడు. ఆమె మొదటి భర్త వెంకటేశ్వర్లుతో కలిసి ఈ మోసాలకు పాల్పడుతోందని.. ఆమెను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను కోరాడు.

సుహాసిని కేసులో మరో ట్విస్ట్​.

ఇదీ చదవండి:CM KCR: పల్లె, పట్టణ ప్రగతి అమలుకు అదనపు కలెక్టర్లకు నిధులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.