ETV Bharat / city

వైరస్​ను దరిచేరనివ్వని త్రీడీ ఫేస్​మాస్క్​ - students Made 3d Face mask

కరోనా వ్యాధి నియంత్రణ చర్యలలో భాగంగా.. హైదరాబాద్ దుందిగల్​లోని మర్రి లక్ష్మణ్​రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు రూపొందించిన త్రీడీ టెక్నాలజీ ఫేస్​మాస్క్​లను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

students Made 3d Face mask
వైరస్​ను దరిచేరనివ్వని త్రీడీ ఫేస్​మాస్క్​
author img

By

Published : Apr 24, 2020, 5:33 AM IST

మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల కార్యదర్శి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ తెరాస ఇంఛార్జి మర్రి రాజశేఖర్​రెడ్డి త్రీడీ ఫేస్​మాస్క్​లను మంత్రి కేటీఆర్​కు అందజేశారు. వైరస్​ను నాశనం చేసే త్రీడీ ఫేస్​మాస్క్​ వినూత్న ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి విస్తరించకుండా తీసుకొనే చర్యలలో భాగంగా ఫేస్​మాస్క్​లు కీలకమైనవని.. ఆ దిశగా త్వరోలోనే నిర్ణయం తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా వీటిని ఉపయోగించే చర్యలు తీసుకుంటామని కేటీఆర్​ తెలిపారు. మర్రి లక్ష్మణ్​రెడ్డి విద్యాసంస్థల ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా త్రీడీ లేజర్ టెక్నాలజీతో తయారు చేసిన యువీ ట్రాలీని మంత్రి కేటీఆర్​కు అందచేశారు. ఈ పరికరం ద్వారా చుట్టూ ఉన్న వాతావరణంలోని కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా, బ్యాక్టీరియా ఆర్ఎన్ఏ అభివృద్ధి చెందకుండా పూర్తిగా నాశనం చేస్తాయి. ఈ పరికరం ఇంటి పరిసరాలు, ఆసుపత్రి గదుల్లో వాడేలా తయారుచేశామన్నారు. ఈ వినూత్న ఆవిష్కరణను వాడుకలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని మర్రి రాజశేఖర్ రెడ్డి బృందాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు.

ఇవీ చూడండి: మూడు నెలలు అద్దె అడగొద్దు.. ఉత్తర్వులు జారీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.