Telangana Students in Ukraine: ఉక్రెయిన్ నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. వారిలో తెలంగాణకు చెందిన విద్యార్థులను హైదరాబాద్ చేరవేయడానికి అన్ని ఏర్పాట్టు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే విద్యార్ధులతో కూడిన ఓ విమానం ముంబయికి.. మరో విమానం దిల్లీకి చేరుకుందని సోమేష్ కుమార్ తెలిపారు. విద్యార్థులను హైదరాబాద్‌కు తరలించడానికి ప్రభుత్వం ఉచితంగా విమాన టికెట్లు అందజేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు సీఎస్ వివరించారు.
హైదరాబాద్‌కు విద్యార్థులు..
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయానికి 20 మంది విద్యార్థులు చేరుకున్నారు. నిన్న రాత్రి ఉక్రెయిన్ నుంచి ముంబయి చేరుకున్న విద్యార్థులు.. కాసేపటి క్రితమే హైదరాబాగ్కు చేరుకున్నారు.
ఇదీ చూడండి: