ETV Bharat / city

సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేత.. - సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

AB VENKATESWARA RAO: సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఆయన సర్వీసు పునరుద్ధరణ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. ఏబీ వెంకటేశ్వరరావు..రిపోర్ట్‌ చేసే వరకు వెయిటింగ్ పిరియడ్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

AB venkateswararao taza
AB venkateswararao taza
author img

By

Published : May 18, 2022, 1:17 PM IST

AB VENKATESWARA RAO: సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీసులోకి తిరిగి తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీ సర్వీసు రీఇన్‌స్టేట్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జీఏడీకి రిపోర్టు చేయాలని సూచించింది.

సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఏబీవీని ఏపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 8న విధుల్లోంచి తొలగించింది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న సమయంలో భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై వేటు వేసిన విషయం తెలిసిందే.

ఏబీవీకి గత నెల సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయనపై సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌లో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దాంతో ఆయన సస్పెన్షన్‌ రద్దయింది. ఏబీవీ సస్పెన్షన్‌ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 7తో ముగిసినందున ఇకపై సస్పెన్షన్‌ చెల్లదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ విచారణను ముగించింది.

ప్రతివాది(ఏబీవీ) ఫిబ్రవరి 8వ తేదీ నుంచి సర్వీసులో ఉన్నట్లు గుర్తించి ఆయనకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు కల్పించాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏబీవీపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.