ETV Bharat / city

Tirumala latest News : రేపటి నుంచే అందుబాటులోకి శ్రీవారిమెట్టు మార్గం - tirupathi latest news

Tirumala latest News : దాదాపు ఆరు నెలల తర్వాత శ్రీవారిమెట్టు కాలినడక మార్గం భక్తులకు అందుబాటులోకి రానుంది. శ్రీనివాస మంగాపురం నుంచి తిరుమలకు చేరుకునే కాలినడక మార్గమైన శ్రీవారి మెట్టు.. గత ఏడాది నవంబర్​లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో భారీగా దెబ్బతింది. మూడున్నర కోట్ల రూపాయలతో చేపట్టిన మరమ్మతులు పూర్తి కావస్తుండడంతో తితిదే అధికారులు రేపట్నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

srivastava steps available
srivastava steps available
author img

By

Published : May 4, 2022, 10:30 AM IST

Tirumala latest News : కలియుగ వైకుంఠనాథుడ్ని దర్శించుకోవడానికి కాలినడకన వచ్చే భక్తులు.. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో పాదయాత్ర చేస్తూ తిరుమల చేరుకొంటారు. శ్రీవారి మెట్టు మార్గంతో పోలిస్తే అలిపిరి కాలిబాట ఎక్కువ దూరం ఉండటంతో అధిక శాతం భక్తులు శ్రీవారిమెట్టు మార్గాన్ని ఎంచుకొని తిరుమల చేరుకొంటారు. 4 కిలోమీటర్లున్న శ్రీవారి మెట్టు మార్గంలో 2 వేల 400 మెట్లున్నాయి. గత ఏడాది నవంబరులో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షంతో శ్రీవారి మెట్టు మార్గం కోతకు గురైంది. మెట్లు, ఇనుపగేట్లు కొట్టుకుపోవడంతో పాటు టోకెన్లు జారీచేసే కేంద్రం మట్టిలో కూరుకుపోయింది. కొండచరియలు విరిగిపడటంతో మెట్లు ధ్వంసమయ్యాయి.

అందుబాటులోకి శ్రీవారిమెట్టు మార్గం..

TTD Latest News : పూర్తిగా ధ్వంసమైన శ్రీవారిమెట్టు మార్గాన్ని మూసివేసిన తి.తి.దే. మూడున్నర కోట్ల రూపాయలతో మరమ్మతులు ప్రారంభించింది. వర్షాలకు పాడైన ప్రదేశంలోకి వాహనాలతో నిర్మాణ సామగ్రి తరలించడానికి వీలుకాకపోవడంతో కార్మికుల ద్వారానే యంత్రాలు, వస్తువులను తీసుకెళ్లాల్సి వచ్చింది. ఫలితంగా నిర్మాణాలు ఆలస్యమయ్యాయి.6 నెలల పాటు సాగిన నిర్మాణాలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. కరోనా నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనడం.. భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి మెట్టు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని తితిదే నిర్ణయించింది. భక్తులు నడిచి వచ్చేందుకు వీలుగా పనులు పూర్తి చేశారు. నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలతో ఐదు ప్రాంతాల్లో కల్వర్టులు దెబ్బతినగా వాటిని పూర్తి చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కల్వర్టుల ఎత్తు, వెడల్పు పెంచి వరద తీవ్రత అధికంగా ఉన్నా తట్టుకొనేలా నిర్మించారు. మరో 25 శాతం పనులు చేయాల్సి ఉన్నా రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులను అనుమతిస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.