ETV Bharat / city

ఎల్​ఎస్​బీసీ పనుల్లో జాప్యం.. దశాబ్దమైనా పూర్తికాని నిర్మాణం!

author img

By

Published : Mar 1, 2021, 7:15 AM IST

ఒప్పందం ప్రకారం 2009 నాటికి పూర్తి కావాల్సిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులు ఇప్పటికీ కాలేదు. రెండేళ్లుగా నిలిచిపోయిన పనులు ప్రారంభించాలంటే సొరంగ మార్గంలో ఉన్న నీటిని బయటకు తోడాలి. దశాబ్దం క్రితమే పూర్తి కావాల్సిన పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

srisailam-left-bank-canal-tunnel-works-delayed-from-decade
ఎల్​ఎస్​బీసీ పనుల్లో జాప్యం

నిర్ణీత వ్యవధిలోగా ప్రాజెక్టు పూర్తవుతుంది. నిర్మాణ వ్యయం పెరగదు. ఈపీసీ పద్ధతిలో గుత్తేదారుతో ఒప్పందం చేసుకొన్నాం.

- 2004లో జలయజ్ఞం ప్రారంభం సందర్భంగా అప్పటి ప్రభుత్వం చెప్పిన మాటలివి.

అప్పటి మాటలు అలా ఉన్నా వాస్తవంలో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల పురోగతి మరీ దయనీయంగా ఉంది. ఒప్పందం ప్రకారం 2009 నాటికి పూర్తి కావాల్సిఉన్నా ఇప్పటికీ కాలేదు. ఎప్పటికవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. రెండేళ్లుగా నిలిచిపోయిన పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా తెలియదు. పని ప్రారంభించాలంటే సొరంగ మార్గంలో ఉన్న నీటిని బయటకు తోడాలి. విద్యుత్తు బిల్లులు కట్టలేదని పనికి అవసరమైన సరఫరా నిలిపివేశారు. రావాల్సిన బిల్లులు చెల్లిస్తే ఏదోవిధంగా రెండుమూడు నెలల్లో ప్రారంభించి 2023 ఆఖరి నాటికి పూర్తి చేస్తానని గుత్తేదారు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే 2025 నాటికి కూడా పూర్తికావడం కష్టమేనని ఇంజినీరింగ్‌ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు రూ.1,925 కోట్లతో చేపట్టిన ఈ పని విలువ ఇప్పటికే రూ.3,075 కోట్లకు చేరింది.

30 టీఎంసీల నీటిని మళ్లించాలని..

ఎస్‌ఎల్‌బీసీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాగునీటితో పాటు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్నది లక్ష్య గ్రావిటీ ద్వారా శ్రీశైలం నుంచి 30 టీఎంసీల నీటిని మళ్లించేందుకు 2005 ఆగస్టు 25న ప్రభుత్వం జయప్రకాశ్‌ అసోసియేట్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఈపీసీ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించారు. రెండు సొరంగ మార్గాలను తవ్వి లైనింగ్‌ చేయాల్సి ఉండగా అది వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలో ఉన్నందున టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌(టీబీఎం) వినియోగించేలా ఒప్పందం జరిగింది. అయితే 2009లో శ్రీశైలానికి వచ్చిన భారీ వరద సహా అడుగడుగునా ఈ పనులకు అవరోధాలు ఎదురవుతున్నాయి.

నాలుగు సార్లు గడువు పెంపు

2009 నాటికి పనులు పూర్తికాకపోవడంతో 2014 డిసెంబరు 31 వరకు గడువు పొడిగించారు. రెండోసారి 2018 ఆగస్టు వరకు, మూడోసారి 2019 నవంబరు వరకు, నాలుగో సారి 2021 డిసెంబరు వరకు పొడిగించారు. అన్నీ సవ్యంగా జరిగితే 2023 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని తాజాగా గుత్తేదారు ఇంజినీర్లకు నివేదించినట్లు తెలిసింది.

తిరిగి ప్రారంభించాలంటే..

చేసిన పనికి రూ.36 కోట్ల బిల్లులు రావాల్సి ఉందని, ఈ మొత్తం ఇస్తే ఔట్‌లెట్‌ వైపు బేరింగ్‌ అమర్చి తిరిగి పని ప్రారంభించడానికి చర్యలు తీసుకొంటామని గుత్తేదారు నివేదించినట్లు తెలిసింది. ఇన్‌లెట్‌ వైపు కూడా రూ.16.05 కోట్ల విద్యుత్తు బిల్లు పెండింగ్‌లో ఉండటంతో ఈ ఏడాది జనవరి నుంచి సరఫరా నిలిపివేశారు. భారీగా నీటిని తోడటానికి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా అవసరం. ప్రతినెలా రూ.1.6 కోట్ల విద్యుత్తు బిల్లు వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని వెలిగొండ సొరంగ మార్గంలో ఇచ్చినట్లుగా డీవాటరింగ్‌కు, విదేశీ కరెన్సీలో మార్పుల కారణంగా అదనంగా అయిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కూడా గుత్తేదారు కోరుతున్నారు. ఇవన్నీ చేస్తే 2023 ఆగస్టు నాటికి పూర్తి చేస్తానని గుత్తేదారు నివేదించినట్లు తెలిసింది. కానీ ఇది అంత సులభం కాదని నీటిపారుదల శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మొదటి సొరంగం..

శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేందుకు హెడ్‌రెగ్యులేటర్‌ నిర్మించి 43.931 కి.మీ సొరంగ మార్గం తవ్వి లైనింగ్‌ చేయాలి. శ్రీశైలం వద్ద నీటిని తీసుకొనే వైపు నుంచి 14.040 కి.మీ దూరం పని పూర్తయింది. 2009లో శ్రీశైలానికి భారీ వరద వచ్చినపుడు నీట మునిగింది. నీటిని తోడి తిరిగి పని ప్రారంభించారు. 2019 డిసెంబరు నుంచి తిరిగి ఈ పని ఆగిపోయింది. ఇందులోకి వచ్చిన మట్టి, ఇతరత్రా పనికి అడ్డంకిగా మారడంతో దీనిని తొలగించి పనిని ప్రారంభించాల్సి ఉంది. సొరంగంలోకి నిమిషానికి 6,900 లీటర్ల నీరొస్తుండగా, 4,913 లీటర్లను బయటకు తోడుతున్నారు. కరెంటు బిల్లు కట్టలేదని విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో జనరేటర్ల ద్వారా చేస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. నీటిని బయటకు వదిలే వైపు 19.314 కి.మీ. తవ్వకం, లైనింగ్‌ పూర్తయింది. అయితే టీబీ యంత్రానికి సంబంధించిన ప్రధాన బేరింగ్‌ ఫెయిల్‌ కావడంతో 2018 మే నుంచి ఈ పని ఆగిపోయింది. ఈ బేరింగ్‌ విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న తర్వాత అవసరమైన డబ్బు కట్టక చెన్నై పోర్టులోనే పది నెలలు ఉండిపోయింది. చివరికి తెచ్చారు. ప్రస్తుతం బేరింగ్‌ మార్చే పని జరుగుతోంది. ఈ సొరంగ మార్గంలో 10.576 కి.మీ దూరం ఇంకా తవ్వాల్సి ఉంది.

రెండో సొరంగం

7.130 కి.మీ దూరం తవ్వాల్సి ఉండగా మొత్తం పని పూర్తయింది. లైనింగ్‌ 3.2 కి.మీ పూర్తవగా, 3.93 కి.మీ ఇంకా చేయాల్సి ఉంది.

పలుసార్లు ప్రత్యేక అడ్వాన్సులు

ప్పందం ప్రకారం గుత్తేదారుకు చెల్లించే మొబిలైజేషన్‌ అడ్వాన్సు కాకుండా పలు దఫాలు ప్రత్యేక అడ్వాన్సును ప్రభుత్వం చెల్లించింది. రూ.1,925 కోట్లతో ఒప్పందం చేసుకోగా, ఇందులో రూ.1,585.32 కోట్లు చెల్లించారు. ఇది కాకుండా పెరిగిన ధరలపైన రూ.269.11 కోట్లు, స్టీలు, సిమెంటుపైనే కాకుండా లేబర్‌ మొదలైన వాటిపై మరో రూ.388.39 కోట్లు.. మొత్తం రూ.2,242.82 కోట్లు చెల్లించారు. ఇందులో రూ.392.5 కోట్లను వసూలు చేశారు. చివరగా 2019 జులై నుంచి 2020 జులై వరకు చెన్నైలో ఉన్న బేరింగ్‌ను తేవడానికి రూ.62.95 కోట్లు ప్రత్యేక అడ్వాన్సు ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.