ETV Bharat / city

పైపులైన్ లీకేజీ... కోతకు గురవుతున్న పొలాలు

ఏపీలోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో శ్రీరామ్ రెడ్డి నీటి ప్రాజెక్టు ప్రధాన పైపులైన్ పగిలింది. పైపులైన్ నుంచి నీరు ఉవ్వెత్తున ఎగిసి పడడం వల్ల చుట్టుపక్కల పంట పొలాలు కోతకు గురయ్యాయి. తరచూ ఈ సమస్య ఎదురవుతోందని రైతులు వాపోయారు.

sriram reddy pipeline in kalyanadurham ananthapuram district Andhra pradesh
శ్రీ రామ్ రెడ్డి నీటి పథకం పైపులైన్ లీకేజీ... కోతకు గురవుతున్న పంట పోలాలు
author img

By

Published : May 27, 2020, 4:25 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్ అయిన శ్రీ రామ్ రెడ్డి నీటి పథకం పైపులైన్.. కల్యాణదుర్గం పరిసరాల్లో ఉంది. ఈ పైపు లైన్ తరచూ లీకై.. గంటల పాటు నీరు వృథా అవుతోంది. నీటి వృథాతో పాటు.. పైపు నుంచి వస్తున్న నీటి ఉద్ధృతికి చుట్టుపక్కల పంటపొలాలు కోతకు గురవుతున్నాయి.

తాజాగా ఈ పైపులైన్​కు గండిపడింది. గండి వల్ల మల్లాపురం గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున టమాటా పంట పూర్తిగా కోతకు గురైంది. లక్ష రూపాయలకుపైగా నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రాంతంలో తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని.. అధికారులు స్పందించి పైపులైన్​ పాడవకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: పారిశుద్ధ్య లోపం.. పొంచి ఉంది అనారోగ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.