ETV Bharat / city

Kaikala Satyanarayana: జగన్​కు కృతజ్ఞతలు తెలుపుతూ కైకాల సత్యనారాయణ లేఖ.. - సీఎం జగన్ కు సత్యనారాయణ లేఖ

Kaikala Satyanarayana: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ లేఖ రాశారు. ఇటీవల తాను అనారోగ్యానికి గురైన సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచినందుకు జగన్‌కు కైకాల కృతజ్ఞతలు తెలిపారు.

VJA_Sr Actor Kaikala letter to CM_Eenadu

author img

By

Published : Jan 20, 2022, 8:07 PM IST

Kaikala Satyanarayana: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ గురువారం(జనవరి 20న) ఉదయం లేఖ రాశారు. ఇటీవల తాను అనారోగ్యానికి గురైన సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చూపించిన ప్రత్యేక శ్రద్ధ తనకెంతో మానసిక ధైర్యాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

‘‘ఇటీవల అనారోగ్యంతో నేను ఆస్పత్రిలో చేరిన వేళ.. మీరు నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. బిజీ షెడ్యూల్‌ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా నాకు ఫోన్‌ చేసి ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా సాయం చేస్తానని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే మీ అధికారులను మా వద్దకు పంపించి సాయం చేశారు. అంతేకాకుండా వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు చూపించిన చొరవ నాకు, నా కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని అందించింది. నటీనటుల సంక్షేమం కోసం మీరు చూపే చొరవ మరోసారి ఈ విధంగా నిరూపితమైంది’’

కైకాల సత్యనారాయణ

ఇదీ చదవండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.