ETV Bharat / city

ప్రత్యేక రేషన్​కు బియ్యం రవాణా షురూ - లాక్​డౌన్​ నేపథ్యంలో రేషన్ బియ్యం పంపిణీ

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో బియ్యం పంపిణీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎఫ్​సీఐ గోదాముల నుంచి పౌరసరఫరాల గోదాములకు చేర్చుతున్నారు. వారాంతం లోగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.

specil ration rice distribution start
ప్రత్యేక రేషన్​కు... బియ్యం రవాణా షురూ
author img

By

Published : Mar 24, 2020, 7:27 AM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ ఉన్నందున పేదలకు ఒక్కొక్కరికి ఉచితంగా 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చౌకధరల డీలర్ల ద్వారా వారాంతంలోగా లబ్ధిదారులకు పంపిణీ చేపట్టేందుకు అధికారులు పనులు వేగవంతం చేశారు. భారత ఆహార సంస్థ గోదాముల నుంచి పౌరసరఫరాల శాఖ గోదాములకు బియ్యం నిల్వల తరలింపు ప్రక్రియను సోమవారం ప్రారంభించారు.

రవాణా వాహనాల సంఖ్య పెంచాలని నిర్ణయం

తొలిదశలో ఎఫ్‌సీఐ గోదాముల నుంచి రాష్ట్రంలోని 170 పౌరసరఫరాల శాఖ గోదాములకు బియ్యం చేరుతాయి. రెండో దశలో అక్కడి నుంచి జిల్లాల వారీగా డీలర్లకు బియ్యాన్ని పంపిణీ చేస్తారు. మొత్తం 3.36 లక్షల మెట్రిక్‌ టన్నులు తరలించాల్సి ఉంటుందని అంచనా. రెండు నెలలకు సరిపడా బియ్యం సరఫరా నేపథ్యంలో.. అవసరం మేరకు రవాణా వాహనాల సంఖ్యను పెంచాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. రవాణాశాఖ ద్వారా వాహనాల గుర్తింపును వేగవంతం చేయాలని ఆ శాఖ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు.

నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణ కోసం కమిటీలు

క్‌డౌన్‌ నేపథ్యంలో ధరలపై నిఘాకు ప్రతి జిల్లాలో మార్కెటింగ్‌, తూనికలు-కొలతలు, జిల్లా పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా స్థాయి కమిటీకి అదనపు కలెక్టర్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

ఇదీ చూడండి: లాక్‌డౌన్‌: అత్యవసరమైతేనే రండి లేదంటే కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.