సుస్వరాల తోటలో విరబూసిన మందార మ్రాను.. సంగీత స్తంభాన్ని ఆసాంతం అల్లుకున్న మల్లె తీగ.. మదిలో మెదిలే ప్రతీ భావానికి రూపం బాలు గానం. పైరగాలిలా.. సెలయేటి హోరులా.. పాపాయి నవ్వులా.. ప్రేమికుని హృదయం మోగించే ప్రణయ వేదంలా.. ఆయన స్వరం అజరామరం. ఆయనో పాటల గ్రంథాలయం.. ఆత్మీయతకు అపురూప రూపం.. వినమ్రతకు నిలువెత్తు దర్శనం.. స్మరణం తప్పా... మరణం లేని గానగాంధర్వునికి నీరాజనాలు. బాలు ప్రథమ వర్ధంతి సందర్భంగా... ఆయన జీవితంలోని అద్వితీయ ఘట్టాలను స్మరించుకుని తరిద్దాం రండి...బాలసుబ్రహ్మణ్యం సరాగాల సుమధురాలు ఆస్వాధించండి...