ETV Bharat / city

కరోనా సోకిందని సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఆత్మహత్య..! - కరోనా సోకిందని సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఆత్మహత్య..!

కరోనా సోకిందని సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఆత్మహత్య..!

author img

By

Published : Jan 27, 2022, 2:15 PM IST

14:10 January 27

కరోనా సోకిందని సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఆత్మహత్య..!

కరోనా సోకిందని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ యువతి(28) హైదరాబాద్​లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పని చేస్తోంది. అల్వాల్‌ కానాజీగూడలో నివాసం ఉంటోంది. ఈ నెల 21న అస్వస్థతకు గురికావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. పరీక్షల్లో ఆమెకు పాజిటివ్​గా తేలింది.

అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఉంటూ.. చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 23న సాయంత్రం తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. అనుమానంతో కుటుంబసభ్యులు ఆమె నివాసానికి వచ్చి పరిశీలించగా.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: Married Woman Kidnapped her Boyfriend: ప్రియుడిని కిడ్నాప్​ చేయించి పెళ్లాడిన వివాహిత.. ఆపై..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.