ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలకు సోమవారం అంతరాయం ఏర్పడింది. సందేశాలు పంపించడానికి వీలు కాకపోవడం వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా.. ఇందుకు గల కారణాలు తెలియరాలేదు.
ఈ వ్యవహారంపై వాట్సాప్ స్పందించింది.
"వాట్సాప్ వినియోగదారులు కొందరు.. యాప్‌ను ఉపయోగించలేకపోతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. సమస్య పరిష్కారానికి మేము కృషి చేస్తున్నాము" అని ఓ ప్రకటన విడుదల చేసింది.
ట్విట్టర్లో ట్రెండింగ్..
భారత్ సహా పలు దేశాల్లో ఈ సమస్య తలెత్తింది. 3 అప్లికేషన్లకు ఫేస్‌బుక్ మాతృసంస్థ కావడం, అన్నీ ఒకేసారి ఆగిపోవడం వల్ల యూజర్లు గందరగోళానికి గురయ్యారు. తమ ఇబ్బందుల్ని.. ట్విట్టర్లో పోస్ట్‌లు చేస్తూ #ఇన్స్టాగ్రామ్డౌన్, #ఫేస్బుక్డౌన్ హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండింగ్ చేశారు.
ఇదీ చదవండి : 'చిత్రసీమకు ఎప్పటికీ చిరంజీవే పెద్ద దిక్కు'