ETV Bharat / city

ఓఆర్​ఆర్​పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి - రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి

రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ వద్ద ఓఆర్​ఆర్​పై జరిగిన రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి చెందగా... మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కర్ణాటకకు చెందిన కూలీలుగా పోలీసులు చెబుతున్నారు.

six members died in accident at pedda golconda orr
ఓఆర్​ఆర్​పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
author img

By

Published : Mar 28, 2020, 6:57 AM IST

Updated : Mar 28, 2020, 12:13 PM IST

రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ బాహ్యవలయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలు వెళ్తున్న బొలేరో వాహనాన్ని వెనక నుంచి లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్​తో సహా ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుల్లో ఓ చిన్నారి, మరో బాలిక ఉన్నారు. గాయపడ్డ ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కర్ణాటకకు చెందిన వీరు కరోనా ప్రభావంతో పనులు లేక సూర్యాపేట నుంచి సొంత గ్రామం రాయచూర్​కి బయలుదేరారు. పెద్ద గోల్కొండ సమీపానికి రాగానే ప్రమాదానికి గురయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఓఆర్​ఆర్​ సిబ్బంది ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ట్రక్​లో సుమారు 30 మంది కూలీలు ఉంటారని పోలీసులు తెలిపారు. నూజివీడు నుంచి మామిడి పండ్లను తీసుకొస్తున్న గుజరాత్​ లారీగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఓఆర్​ఆర్​పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

ఇదీ చూడండి: జిల్లాల్లోనే మంత్రులు.. కరోనాపై సమీక్షలు

Last Updated : Mar 28, 2020, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.