ETV Bharat / city

నివేదిక వచ్చే వరకు గ్రామాలకు వెళ్లొద్దు: అవంతి

ఆంధ్రప్రదేశ్ విశాఖలోని ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమలోని స్టైరిన్ ట్యాంక్​ ఉష్ణోగ్రత 80 డిగ్రీలకు వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. ​చుట్టు పక్కల గ్రామాల్లో నివాసానికి అనువైన పరిస్థితులపై అధ్యయనం జరుగుతోందని వెల్లడించారు. నివేదిక వచ్చే వరకు గ్రామాలకు వెళ్లొద్దని ప్రజలకు మంత్రి సూచించారు.

author img

By

Published : May 10, 2020, 8:14 PM IST

situations are under control lg polymers surroundings says minister avanthi srinivas
నివేదిక వచ్చే వరకు గ్రామాలకు వెల్లొద్దు: మంత్రి అవంతి

ఆంధ్రప్రదేశ్ విశాఖలోని ఎల్​జీ పాలిమర్స్​ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. స్టైరిన్ ట్యాంక్ ఉష్ణోగ్రత 80 డిగ్రీలకు తగ్గిందన్నారు. పరిశ్రమ చుట్టు పక్కల గ్రామాల్లో నివాసానికి అనువైన పరిస్థితులపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందన్న మంత్రి... నివేదిక వచ్చే వరకు ప్రజలు గ్రామాలకు వెళ్లొద్దని కోరారు.

స్టైరిన్ ట్యాంక్ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ జీఎం మోహన్​రావు చెప్పారు. ప్రమాదానికి కారణమైన స్టైరిన్ లిక్విడ్ గడ్డకట్టి పాలిమర్ అయ్యిందని అన్నారు. దీని నుంచి ఎలాంటి వాయువు బయటకు రావడం లేదని స్పష్టం చేశారు. ఇది కాకుండా కంపెనీలో 2, విశాఖ పోర్టులో 2 స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయని... వాటిల్లో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ట్యాంకుల్లో ఉన్న లిక్విడ్ స్టైరిన్‌ను వెనక్కి పంపే ఆలోచన చేస్తున్నామని జీఎం వివరించారు.

ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.