ETV Bharat / city

Singareni Privatization : సింగరేణి నెత్తిన 'వేలం' కుంపటి

Singareni Privatization : సింగరేణి సంస్థకూ ప్రైవేటు పోరు తప్పేలా లేదు. ఇంతకాలం నిల్వలున్న ప్రాంతాల్లో కొత్త గనులు తవ్వుకుంటూ వస్తోన్న సంస్థ నెత్తిన కేంద్రం ‘వేలంలో పాడుకుంటేనే’ అనే కొత్త కుంపటి పెట్టడమే దానికి కారణం. దీని పర్యవసానాలు సంస్థను పిడుగులా తాకే ప్రమాదం లేకపోలేదని, పరోక్షంగా తెలంగాణలో నిర్మిస్తున్న నూతన థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలపైనా తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళనను అటు సంస్థ ఉన్నతాధికారులు, ఇటు కార్మిక సంఘాలు వ్యక్తంచేస్తున్నాయి.

Singareni Privatization, సింగరేణి
సింగరేణి గనుల ప్రైవెటీకరణ
author img

By

Published : Dec 14, 2021, 6:49 AM IST

Singareni Privatization : దేశంలోని గనుల వేలానికి సంబంధించి కేంద్రం ఇటీవల ‘ఖనిజాలు, గనుల అభివృద్ధి’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దేశంలోని గనులను వేలంవేసి అధిక ధర నమోదు చేసిన వారికి కేటాయించడమే ఈ విధానం. వేలం జాబితాలో తొలిసారి తెలంగాణలోని నాలుగు కొత్త బొగ్గు గనులను నమోదుచేసింది. నూతన విధానం కింద వీటిని వేలం వేస్తున్నామని, వాటి అవసరం ఉందనుకుంటే ప్రైవేటు కంపెనీలతోపాటు వేలంలో పాల్గొని సొంతం చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ప్రతి గనిపై వచ్చే ఆదాయంలో ఎంత సొమ్మును ప్రభుత్వ వాటా కింద ఆదాయ భాగస్వామ్యం(రెవెన్యూ షేర్‌) ఇస్తారో తెలుపుతూ వేలం టెండర్లలో ధరను కోట్‌ చేయాలనే నిబంధన విధించింది. వేలం విధానాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మిక సంఘాలు ఈ నెల 9 నుంచి 3 రోజులపాటు సమ్మె చేశాయి.

చేసిన ఖర్చంతా వృథాయేనా

Singareni Mines Privatization : గోదావరి పరీవాహక ప్రాంతంలో బొగ్గు తవ్వకాలకుగానూ సింగరేణి సంస్థకు 44 అనుమతులను (లైసెన్సులను) నిజాం ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారు. నూతన విధానంలో భాగంగా ఈ ప్రాంతాలకు బయట ఉన్న గనులను కేంద్రం వేలం జాబితాలో చేర్చింది. నిజానికి ఈ నాలుగు గనుల్లో బొగ్గు నిల్వలు ఏమేరకు ఉన్నాయి? ఉత్పత్తి సామర్థ్యం ఎంత? అనే అంచనాలు రూపొందించేందుకు చేసిన సర్వే, మౌలిక సదుపాయాలకుగానూ సంస్థ రూ.167 కోట్లను కొన్నేళ్లుగా ఖర్చుపెట్టింది. పైగా ఈ నాలుగు..ప్రస్తుతం సింగరేణికున్న పాత గనుల పక్కనే ఉండటం వల్ల వాటి నుంచి బొగ్గు తవ్వడం సులభం. ఈ పరిస్థితుల్లో అవి ప్రైవేటుపరమైతే ఇప్పటివరకూ చేసిన ఖర్చు వృథా కావడంతోపాటు, ఆయా సంస్థలకు అయాచిత లబ్ధి చేకూర్చినట్లవుతుందని సంస్థ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

.

థర్మల్‌ కేంద్రాలపైనా ప్రభావం

Telangana Thermal Power Plants : ఇప్పటివరకూ సంస్థ 176 మంది అనుభవజ్ఞులైన సర్వేయర్లతో నిరంతరం బొగ్గు నిక్షేపాలపై అధ్యయనం చేస్తూ కొత్త గనుల్లో తవ్వకాలు చేపడుతూ వస్తోంది. అయినా మార్కెట్‌ గిరాకీని అందుకోలేకపోతోంది. 2011-12లో 5.22 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణి, 2020-21లో అంతకన్నా 17 లక్షల టన్నులు తక్కువగా తవ్వగలిగింది. మరోవైపు తెలంగాణలో ఎన్టీపీసీ, రాష్ట్ర జెన్‌కో కొత్త విద్యుత్‌ కేంద్రాలు నిర్మిస్తున్నాయి. వీటికి నిత్యం లక్షల టన్నుల బొగ్గు కావాలి. కనీసం 10 కోట్ల టన్నులు ఏటా తవ్వితేనే 2025 నాటి మార్కెట్‌ అవసరాలను తీర్చగలుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఏటా కోటి టన్నుల ఉత్పత్తికి అవకాశమున్న నాలుగు కొత్త గనులను కేంద్రం వేలంలో పెట్టిందని, అవి దక్కకపోతే 10 కోట్ల టన్నుల లక్ష్యాన్ని చేరడం సాధ్యం కాదని సింగరేణి వర్గాలు పేర్కొంటున్నాయి.

పోటీపడటం సాధ్యమా?

Singareni Samme : ప్రస్తుతం సింగరేణి సంస్థలో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారికి వేతనాలతోపాటు నివాసం సహా పలు సదుపాయాలను సంస్థ కల్పిస్తోంది. ఈ కారణంగా సగటున టన్ను బొగ్గు తవ్వకానికి రూ.2 వేలకు పైగా ఖర్చవుతోంది. ప్రైవేటు కంపెనీలు పరిమిత వేతనాలతో, అతి తక్కువ సిబ్బందితో అంతకన్నా తక్కువ వ్యయానికి బొగ్గుతవ్వి లాభాలకు అమ్ముతాయి. ఆ పరిస్థితుల్లో సింగరేణి వాటితో పోటీపడటం అసాధ్యమనే అభిప్రాయాన్ని పలు కార్మిక సంఘాల ప్రతినిధులతోపాటు, సంస్థ ఉన్నతాధికారులు ‘ఈనాడు’తో వ్యక్తంచేశారు. అంతిమంగా ఈ పరిణామాలు సంస్థ మనుగడకు ముప్పుగా మారుతాయని ఆందోళన చెందుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.