తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజైన సోమవారం స్వామివారు సింహవాహనంపై యోగనరసింహుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి సన్నిధి నుంచి విమాన ప్రదక్షణగా కల్యాణ మండపానికి వేంచేసి సింహవాహనంపై ఆశీనులైన మలయప్ప స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు.
మంగళవాయిద్యాలు, పండితుల వేద మంత్రాల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా ప్రభావంతో ఉత్సవాలను అధికారులు ఆలయానికే పరిమితం చేశారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో దూకుడు పెంచిన కాంగ్రెస్.