ETV Bharat / city

'జల్​పల్లిలో అమన్ యువజన సంఘం శ్రమదానం' - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

గ్రామంలో అందరిలా మామూలుగా ఉండడం వేరు.. ఊరి బాగుకోసం ఏదైనా చేయడం వేరు. అలాంటి కోవకు చెందినవారే తమ ఊరిలో శ్రమదానం చేస్తూ.. సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.. రంగారెడ్డి జిల్లా జల్​పల్లి గ్రామంలోని అమన్ యువజన సంఘం సభ్యులు.

Aman Youth Association sramadaanam
అమన్ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రమదానం
author img

By

Published : Dec 22, 2020, 6:51 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి గ్రామం వీకర్ సెక్షన్ కాలనీలో అమన్ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. పారిశుధ్య పనులు, కాగితపు సంచుల పంపిణీ చేశారు. అధ్యక్షుడు అబ్దుల్ నవాజ్, అబ్దుల్ రహీం ఫైజుద్దీన్ మొక్కలు నాటి రోడ్లు ఊడ్చారు.

పారిశుధ్య పనులు, మొక్కలు నాటడం, ఇతర కార్యక్రమాలతో సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతుంటామని యువజన సంఘం అధ్యక్షుడు అబ్దుల్ నవాజ్ అన్నారు. కార్యక్రమంలో జల్​పల్లి కాన్సిలర్ యాదగిరి, కో ఆప్షన్ సభ్యుడు సుర్రెడ్డి కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: "అవేర్ గ్లోబల్" అరుదైన శస్త్రచికిత్స... మూత్రపిండాల్లో 55 రాళ్ల తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.