కరోనా మహమ్మారి వ్యాపార రంగాన్ని కుదేలు చేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో దుకాణాలు తెరవాలంటేనే వ్యాపారులు భయపడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వ్యాప్తికి తాము కారణం కారాదనే భావనతో ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 26 నుంచి జులై 5 వరకు సికింద్రాబాద్‌లోని వస్త్ర దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సికింద్రాబాద్ చేనేత, సిల్కు, వస్త్ర దుకాణదారుల సంఘ అధ్యక్షుడు టి.అశోక్‌కుమార్ వెల్లడించారు.
సికింద్రాబాద్‌లోని జనరల్ బజారులోని బంగారు, వెండి, వజ్రాభరణాల దుకాణదారులూ అదే బాటలో ఉన్నారు. సూర్యా టవర్స్, ప్యారడైజ్ ప్రాంతాల్లోని దుకాణాలను కూడా బంద్ చేస్తున్నారు. బేగంబజార్, ఫీల్‌ఖానా, సిద్ధిఅంబర్ బజార్, ఉస్మాన్‌గంజ్, ఎన్‌ఎస్ రోడ్డులోని హోల్‌సేల్ దుకాణదారులు కూడా బంద్ పాటిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్లన్నీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అమ్మకాలు కొనసాగించినట్లు హైదరాబాద్ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్‌వ్యాస్ చెప్పారు.
ఇదీ చూడండి : తోటమాలిగా చిరంజీవి.. కెమెరా పట్టిన మమ్ముట్టి