హైదరాబాద్ నగరంలో అమలవుతున్న లాక్‌డౌన్ వల్ల కరోనా సెకండ్ డోసు ఎలా వేసుకోవాలనే అయోమయంలో పడిపోయారు. అసలు టీకా ఎక్కడ అందుబాటులో ఉందో..? ఉన్నా అక్కడి వరకు ఎలా వెళ్లాలో..? అడ్రస్ సరిగా దొరుకుతుందో లేదో...? అంటూ ఎన్నో ప్రశ్నలతో ఆందోళన చెందుతుంటారు. అన్ని ఆందోళనలు వదిలేయండి... జస్ట్ ఈ లింక్ క్లిక్ చేయండి చాలు... అన్నింటికీ సమాధానంతో పాటు.. వ్యాక్సిన్ సెకండ్ డోస్ దొరికేసినట్టే...
https://www.google.com/maps/d/u/1/viewer?mid=1JAQBqnM43pPidcaXx6O16Rzvcty-aKxi&ll=17.41204093519638,78.47211825000001&z=11
నగరంలో కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో ప్రజలు సులువుగా తెలుసుకునేందుకు సెంటర్లకు అధికారులు జియో లొకేషన్లు పెట్టారు. ఈ లింక్ క్లిక్ చేస్తే చాలు... కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఏ ఏ ప్రాంతాల్లోని సెంటర్లలో అందుబాటులో ఉన్నాయో చూపిస్తాయి. దాన్ని బట్టి దగ్గర్లో ఉన్న సెంటర్లను ఎంపిక చేసుకుని సులువుగా వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం వెళ్లే వారు తమ వెంట ఆధార్ గుర్తింపు కార్డు, మొదటి డోసు వేసుకున్న ధ్రువపత్రం తీసుకువెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. పోలీసులకు ఈ పత్రాలు చూపించినట్టయితే... వ్యాక్సిన్ సెంటర్లకు అనుమతిస్తారని స్పష్టం చేశారు.