కొవిడ్ కట్టబడిలో భాగంగా రెండో దశ టీకా కార్యక్రమం.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సందడిగా సాగుతోంది. ఎంపిక చేసిన ప్రధాన, ప్రైవేటు ఆస్పత్రుల్లో... ఈ కార్యక్రమం కొనసాగుతోంది. 60 ఏళ్లు పైబడిన... దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైబడిన వారందరూ.. అపోహలు లేకుండా తప్పకుండా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. టీకా తీసుకోవాల్సిన విషయంలో.. భయపడాల్సిన అవసరం లేదన్నారు. గాంధీ ఆస్పత్రిలో కిషన్ రెడ్డి... కోవాగ్జిన్ మొదటి డోస్‌ను తీసుకున్నారు. త్వరలో ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సిన్ కేంద్రాలను మరిన్ని పెంచనున్నట్లు.. కిషన్ రెడ్డి తెలిపారు. కొవిడ్ కట్టడిలో దేశానికే ఆదర్శంగా నిలిచామని.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.
రెండో విడత వ్యాక్సినేషన్ లో భాగంగా...మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు...ఇవాళ వరంగల్ ఎంజీఎంలో టీకా తొలిడోసును తీసుకున్నారు. ఎర్రబెల్లితోపాటు ఆయన సతీమణి, ఇతర కుటుంబ సభ్యులూ... నగర మేయర్ గుండా ప్రకాష్.. టీకా తీసుకున్నారు. కరోనా వ్యాక్సీన్ పై ఎలాంటి అపోహలు వద్దని.. మంత్రి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అర్హులైన వారంతా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని.. అందుబాటులో ఉన్న కేంద్రాల్లో వేయించుకోవాలని కోరారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా మాస్కులు ధరించడం మరవద్దని... జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సూచించారు. నిమ్స్ ఆసుపత్రిలో... మేయర్ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.