ETV Bharat / city

ఓటరు స్లిప్పుల పంపిణీని రేపటిలోగా పూర్తి చేయాలి: ఎస్​ఈసీ - voter slips for ghmc elections

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఓటర్ స్లిప్పుల పంపిణీపై ఎస్​ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వంద శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ జరగాలని అధికారులను ఆదేశించింది. ఓటరు స్లిప్పుల పంపిణీ ఈ నెల 25లోపు పూర్తి చేయాలని సూచించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందితో పాటు అభ్యర్థుల ఏజెంట్లు పూర్తి స్థాయిలో గోపత్య పాటించాలని ఎసీఈసీ స్పష్టం చేసింది. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు కూడా బ్యాలెట్​ పత్రాన్ని ఎవరికి చూపరాదని తెలిపింది.

SEC issued directions on distribution of voter slips for GHMC elections
ఓటరు స్లిప్పుల పంపిణీని రేపటిలోగా పూర్తి చేయాలి: ఎస్​ఈసీ
author img

By

Published : Nov 24, 2020, 5:06 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కోసం ఓటరు స్లిప్పుల పంపిణీని రేపటిలోగా వందశాతం పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 2009, 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వివిధ రకాల ఓటరు అవగాహనా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పోలింగ్ 50 శాతం మించలేదని... ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తిగా జరగకపోవడమే ఇందుకు ఓ ప్రధాన కారణంగా భావిస్తున్నట్లు ఎస్ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ నెల డిసెంబర్ ఒకటో తేదీన జరగనున్న పోలింగ్ కోసం ఈ నెల 25వ తేదీ లోగా ఓటరు స్లిప్పులను క్షేత్రస్థాయి సిబ్బంది పంపిణీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పంపిణీని జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.

స్లిప్పుల పంపిణీని ధృవీకరించుకోవాలి...

డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని కనీసం 30శాతం ఇళ్లను, జోనల్ కమిషనర్లు తమ పరిధిలోని కనీసం పదిశాతం ఇళ్లను సందర్శించి ఓటరు స్లిప్పుల పంపిణీ జరిగిందా లేదా అన్న విషయాన్ని ధృవీకరించుకోవాలని తెలిపింది. ప్రతి వార్డుకు ఒక ఉద్యోగిని కేటాయించి మహిళా సంఘాలు, ఇంటి యజమానులను ఫోన్​లో సంప్రదించి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించింది. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి 27వ తేదీలోగా ఆయా ప్రాంతాల్లో ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించింది. అధికారులు, పరిశీలకులు ఓటరు స్లిప్పుల పంపిణీని పర్యవేక్షిస్తారని, ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.

గోప్యత పాటించాలి..

ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందితో పాటు అభ్యర్థుల ఏజెంట్లు పూర్తి స్థాయిలో గోపత్య పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటుహక్కు వినియోగించుకున్న తర్వాత ఓటరు కూడా బ్యాలెట్ పత్రాన్ని ఎవరికీ చూపరాదని, గోప్యంగా ఉంచాలని తెలిపింది. పంచాయతీరాజ్ స్థానికసంస్థల ఎన్నికల సమయంలో కొందరు బ్యాలెట్ పత్రాలను ఫోటోలు తీసిన నేపథ్యంలో ఓటింగ్ కంపార్ట్​మెంట్ వరకు ఓటర్లతో పాటు మొబైల్ ఫోన్లను అనుమతించరాదని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఓటు గోప్యత ఉల్లంఘనకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, మూణ్నెళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. అటు జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, వారి తరపున ఉండే పోలింగ్ ఏజెంట్ల సంతకాలను సేకరించాలని రిటర్నింగ్ అధికారులను ఎస్​ఈసీ ఆదేశించింది. ఈ మేరకు వారి సంతకాలను సేకరించి వాటిని ప్రిసైడింగ్ అధికారులకు పంపాలని తెలిపింది. తద్వారా వారి సంతకాల ధృవీకరణ సమస్య ఉత్పన్నం కాదని పేర్కొంది.

ఇవీ చూడండి: బల్దియా పోరులో సై అంటున్న విద్యావంతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.