ETV Bharat / city

శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట - రంగారెడ్డి జిల్లాలో చిరుత

రంగారెడ్డి జిల్లా పోలీసులు, అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న చిరుత.. ఈ ఉదయం హిమాయత్ సాగర్ చెరువు వద్ద కనిపించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది.. ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. కాలి గుర్తుల ఆధారంగా శంషాబాద్​ వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

searching for cheetah
శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట
author img

By

Published : May 16, 2020, 4:58 PM IST

ఇవాళ ఉదయం మొయినాబాద్​ మండలం అజీజ్ నగర్ గ్రామానికి చెందిన కిష్టయ్య చేపలు పట్టేందుకు హిమాయత్​ సాగర్​కు వెళ్లగా అక్కడ చిరుత కనిపించింది. కిష్టయ్య వెంటనే తన తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాడు. అతని నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. కిష్టయ్యను వెంటబెట్టుకొని చిరుత కనిపించిన ప్రాంతంలో గాలింపు చేపట్టారు. కాలి గుర్తుల ఆధారంగా శంషాబాద్​ వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

48 గంటలు దాటుతున్న చిరత దొరక్కపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం కాటేదాన్ వద్ద జాతీయ రహదారిపై లారీ డ్రైవర్​పై దాడి చేసినప్పటి దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట

ఇవీ చూడండి:
'కరోనా దృష్ట్యా శంషాబాద్‌ విమానాశ్రయంలో సమూల మార్పులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.