తెలంగాణ ప్రభుత్వం 2019 సంవత్సరానికి ప్రకటించే ఇంధన పొదుపు అవార్డుల్లో మూడింటిని దక్షిణ మధ్య రైల్వే సొంతం చేసుకుంది. ప్రభుత్వ భవనాల విభాగంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి ప్రథమ బహుమతి, సికింద్రాబాద్ డివిజన్ సంచాలన్ భవన్‌కు ద్వితీయ బహుమతి, ఇతర విభాగంలో లాలాగూడా గ్యారేజ్ వర్క్ షాప్‌కు ప్రథమ బహుమతి లభించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేష్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక సంస్థ ఇవాళ నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను అందజేస్తుంది.
ఇదీ చూడండి: లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ నియామకం