ETV Bharat / city

వైరల్​: సింహపురి చిన్నోళ్లు... నెట్టింట్లో హల్​చల్!

author img

By

Published : Aug 14, 2020, 7:41 AM IST

ఆ ఫైట్ చూస్తే.. ఎన్ని రోజులు తీశారో అనుకుంటారు. ఆ ఎఫెక్ట్స్ చూస్తే.. వామ్మో.. ఎవరో సినీ ఇండస్ట్రీలో నైపుణ్యమున్నవాడే.. ఎడిటింగ్ రూమ్​లో కూర్చున్నాడేమో.. అనిపిస్తుంది. ఆ చిచ్చర పిడుగుల నటన.. స్టార్లకు ఏ మాత్రం తీసిపోదు. 'రమణా లోడెత్తాలిరా'.. అని మహేశ్ బాబు అంటే ఫ్యాన్స్ ఒకటే విజిల్స్.. ఓ బుడ్డోడు అదే డైలాగ్ చెబితే.. సోషల్ మీడియాలో షేర్లే.. షేర్లు.. లైకులే లైకులు.. ఇంతకీ ఆ ఫైట్స్​ తీసింది ఎవరు? ఎక్కడి వారు?

వైరల్​: సింహపురి చిన్నోళ్లు... నెట్టింట హల్​చల్!

ఏపీలోని నెల్లూరు జిల్లా కేంద్రం శివారు ప్రాంతం.. భగత్ సింగ్ కాలనీ. పక్కనే జనార్ధనరెడ్డి కాలనీ. ఈ రెండూ కాలనీలు మురికివాడలే. ఈ కాలనీలకు చెందిన కిరణ్ వయస్సు 19 ఏళ్లు. తొమ్మిదో తరగతితో చదువు ఆపేశాడు. కూలీ పనులకు వెళ్తుంటాడు. లాయక్​ ఇంటర్ పూర్తి చేశాడు. ఈ యువకుడు కూడా దుకాణంలో పనిచేస్తున్నాడు. మున్నా తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వయసులో తేడాలున్నా ముగ్గురూ స్నేహితులది ఒకేరకమైన ఆలోచన. అవకాశాలు వస్తే సినిమాల్లోకి వెళ్లాలనే తపన. అందుకే తమ నైపుణ్యానికి పదును పెట్టేందుకు షార్ట్ ఫిల్మ్​లు తీస్తున్నారు.

ఈ క్రమంలోనే వీరికి ఓ ఆలోచన వచ్చింది. హీరో మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో యాక్షన్ సిక్వెల్స్​ చిత్రీకరణ చేశారు. మెుదట కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఫైట్ సీన్ తీశారు. అచ్చుగుద్దినట్లు ఎడిటింగ్ చేశారు. స్లమ్ ఏరియాలో చిన్నపిల్లలతో చిత్రీకరించి.. వారెవ్వా అనిపించుకున్నారు. మరో ఫైట్​.. ఇంకా గొప్పగా చిత్రీకరించారు. రమణా... లోడెత్తాలిరా అనే డైలాగ్​తో మొదలైన సీన్​ను దింపేశారు. కేవలం సెల్​ఫోన్​తోనే వీడియో తీసి.. ఎడిటింగ్ చేశారు. సరదాగా తీసిన ఈ రెండు ఫైట్లను యూట్యూబ్​లో అప్​లోడ్ చేశారు.

ఇక వేలాది మంది నుంచి అభినందనల వెల్లువ. ఏకంగా సరిలేరూ.. నీకెవ్వరూ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఫైట్ మాస్టర్లు రామ్ ,లక్ష్మణ్​లు మెచ్చుకున్నారు. ఈ ఫైట్​లో మహేష్ పాత్రలో నటింటిన మున్నా.. ఇంకా పాఠశాల విద్యార్థే. సీన్​లో ఉన్న పిల్లలంతా.. ఆరు నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్నవారే. వారంతా.. దీని కోసం.. ఒకేరోజు ప్రాక్టీస్ చేశారు. అవకాశాలు వస్తే.. సినిమాల్లోకి వెళ్లాలనేది వారి కోరిక. వారు అనుకున్నది నెరవేరాలని కోరుకుందాం..!

ఇదీ చదవండి:

నిరాడంబరంగా మెగా డాటర్​ నిశ్చితార్థం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.