ETV Bharat / city

రుణాల కోసం ఆర్టీసీ కార్మికుల ఎదురుచూపులు

భవిష్యత్​లో వాడుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును యాజమాన్యం వాడుకుంది. కానీ ఇంతవరకు కార్మికులకు చెల్లించలైదు. పైగా లాక్​డౌన్​తో వేతనాలు కూడా సగమే చెల్లిస్తున్నారు. పొదుపు చేసుకున్న సొమ్ము నుంచైనా రుణు తీసుకునేందుకు కార్మికులు ఎదురుచూస్తున్నారు.

rtc employees silent protest in ccs office for saving money
రుణాల కోసం ఆర్టీసీ కార్మికుల ఎదురుచూపులు
author img

By

Published : Jun 25, 2020, 9:26 AM IST

అత్యవసర పరిస్థితుల్లో వాడుకునేందుకు 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యోగుల సహకార పరపతి సంఘం(సీసీఎస్‌) పేరుతో నెలవారీగా దాచుకున్న సొమ్ము వడ్డీతో కలిపి రూ.726.74 కోట్లు అయింది. ఈ మొత్తాన్ని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం వినియోగించుకుంది. తిరిగి చెల్లించనందున... పొదుపు చేసుకున్న సొమ్ము నుంచి రుణం తీసుకునేందుకు కార్మికులు సుమారు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. తక్షణం కొంత మొత్తాన్ని విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించినా స్పందన లేదు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండటమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం సగం జీతమే ఇస్తోంది. పీఎఫ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా చెల్లించలేని పరిస్థితిలో ఆర్టీసీ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక అవసరాల కోసం సీసీఎస్‌లో పొదుపు చేసుకున్న మొత్తం నుంచి రుణం తీసుకునేందుకు అవకాశం లేకపోవటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. వాడుకున్న తమ సొమ్మును తమకు ఇవ్వాలంటూ సీసీఎస్‌ కార్యాలయంలో పాలకవర్గం బుధవారం మౌనదీక్ష చేపట్టడంతో ఆ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.

ఉద్యోగులు నెల వారీ జీతం నుంచి ఏడు శాతం మొత్తాన్ని ఆర్టీసీ యాజమాన్యం కట్‌ చేసి పరపతి సంఘంలో జమ చేస్తుంది. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారటం వల్ల 2018 అక్టోబరు నుంచి పరపతి సంఘానికి జమ చేయటం లేదు. ఆ మొత్తమే రూ.624.35 కోట్లకు చేరింది. దానిపై వడ్డీ మరో రూ.102.39 కోట్లు యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. గతేడాది ఆగస్టు నుంచి రుణాలకోసం 12వేల మంది ఉద్యోగులు సీసీఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

ఇదీ చూడండి: నర్సాపూర్​ అడవులు: ఎన్నో అందాలు.. మరెన్నో ప్రత్యేకతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.