ఆర్పీఎస్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణా శిబిరాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విడుదల చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా యువతీ యువకుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకే... జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థతో కలిసి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్పీఎస్ దక్షిణ ప్రాంతీయ సలహాదారు ప్రతిభ పులిజాల తెలిపారు.
18 నుంచి 40 సంవత్సరాల వయస్సు వారిలో 80 శాతం మందికి నైపుణ్యం లేక అవకాశాలు సన్నగిల్లుతున్నాయని అన్నారు. జర్నలిజం, ఫొటోగ్రఫీ, నృత్యం, షార్ట్ మూవీస్ స్క్రిప్ట్ రైటరింగ్ వంటి రంగాల్లో స్వతహాగా రాణిస్తున్నప్పటికీ... గుర్తింపు లేక వెనకబడుతున్నారని వివరించారు. మెలుకువలు నేర్పించి వృత్తిలో ఎదిగేందుకు కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు.
ఇదీ చూడండి: ఆడిటోరియానికి మహతి పేరు ఎందుకు పెట్టారంటే?