ETV Bharat / city

తెలంగాణలో ఆగిన ఈ స్టాంపుల విక్రయం... రిజిస్ట్రేషన్లకు బ్రేక్

author img

By

Published : Sep 7, 2020, 12:50 PM IST

Updated : Sep 7, 2020, 2:43 PM IST

revenue registrations stopped in telangana
రాష్ట్రవ్యాప్తంగా ఆగిన రిజిస్ట్రేషన్లు

12:48 September 07

తెలంగాణలో ఆగిన ఈ స్టాంపుల విక్రయం... రిజిస్ట్రేషన్లకు బ్రేక్

తెలంగాణలో ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఈ-స్టాంపుల విక్రయాన్ని రిజిస్ట్రేషన్ల శాఖ ఆపివేసింది. ఇప్పటికే ఈ-స్టాంపులు కొనుగోలు చేసి, చలానాలు చెల్లించిన వారి ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఇవాళ గడువు విధించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు.. మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.  

రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం తీసుకురావాలని యోచిస్తున్న ప్రభుత్వం.. వీఆర్​వోల వద్ద ఉన్న ఆస్తులకు సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకోవాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. అనంతరం రిజిస్ట్రేషన్ల నిలిపివేతకూ అదే తరహా ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం ఏ ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుందో అధికారులకు కూడా పూర్తిగా తెలియడం లేదు.  

రానున్న రోజుల్లో సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయలు లేని చోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా తహసీల్దార్లకే అప్పగించాలని యోచిస్తున్న ప్రభుత్వం.. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.    

ఇవీచూడండి: వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డుల స్వాధీనానికి ప్రభుత్వం ఆదేశం

Last Updated : Sep 7, 2020, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.