ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మెన్, సభ్యులను నియమించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కీలక స్వతంత్ర సంస్థలు... ఐదున్నరేళ్ల తెరాస పాలనలో నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. ఈఆర్సీ పాలకమండలి పదవీ కాలం పూర్తై ఎనిమిది నెలలు కావస్తున్నా... భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
ఆర్థిక క్రమశిక్షణ లోపించి, విత్యుత్ సంస్థలు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2014-15 నుంచి ఇప్పటి వరకు ఈఆర్సీకి ప్రభుత్వం నివేదికలు అందించలేదని చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలు నవంబరు 2లోపు పంపాల్సి ఉన్నందున... ఛైర్మెన్, సభ్యుల నియామకం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈఆర్సీ అనుమతి లేకుండా విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా చట్ట విరుద్దమేనని రేవంత్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: యువకుడి అదృశ్యం... అంతా ఓ నాటకం