ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా కాంగ్రెస్ కీలక నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ క్రమంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని కూడా గృహనిర్బంధం చేసి, ఇంటి చుట్టూ పోలీస్ పహారా ఏర్పాటు చేశారు.
సినీ ఫక్కీలో...
అయితే... రేవంత్ పోలీస్ పహారను తప్పించుకుని... తన ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై ప్రగతి భవన్‌కు వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా... అతని అనుచరుల సాయంతో రేవంత్ బైక్‌పై ప్రగతిభవన్ వైపు వెళ్లారు. పోలీసులు అడ్డుకోవడం, రేవంత్ అనుచరులు ప్రతిఘటించడం సినిమా సన్నివేశాన్ని తలపించింది.
- ఇదీ చూడండి : మోదీజీ.. దక్షిణాది తారలనూ గుర్తించండి: ఉపాసన