కాంగ్రెస్ నేత శశిథరూర్‌పై.. ఇటీవల.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy) చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పార్లమెంటరీ ఐటీ స్థాయీసంఘం ఛైర్మన్ హోదాలో ఈ మధ్య హైదరాబాద్‌కు వచ్చిన థరూర్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. దానిపై రేవంత్.. థరూర్‌ను విమర్శించారు. ఈ క్రమంలో థరూర్‌కు రేవంత్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. దానికి శశిథరూర్ స్పందిస్తూ.. ఈ వివాదానికి ముగింపు పలుకుదామన్నారు. 'మనం అంతా కలిసి దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం' అని రీట్వీట్ చేశారు.
-
I received a gracious call from @revanth_anumula to apologise for what was said. I accept his expression of regret & am happy to put this unfortunate episode behind us. We must work together to strengthen @INCIndia in Telengana & across the country. https://t.co/pwIRmxpipn
— Shashi Tharoor (@ShashiTharoor) September 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I received a gracious call from @revanth_anumula to apologise for what was said. I accept his expression of regret & am happy to put this unfortunate episode behind us. We must work together to strengthen @INCIndia in Telengana & across the country. https://t.co/pwIRmxpipn
— Shashi Tharoor (@ShashiTharoor) September 16, 2021I received a gracious call from @revanth_anumula to apologise for what was said. I accept his expression of regret & am happy to put this unfortunate episode behind us. We must work together to strengthen @INCIndia in Telengana & across the country. https://t.co/pwIRmxpipn
— Shashi Tharoor (@ShashiTharoor) September 16, 2021
రేవంత్ వ్యాఖ్యలు దారుణం..
-
While scumbags like @revanth_anumula need not be responded to; it’s important to expose filth
— KTR (@KTRTRS) September 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Here’s his audio clip/comments on Tharoor. Sent to me by a reporter
I am sure if we send it to a forensic lab, it’ll match his infamous #Note4Vote voice
Any comments @RahulGandhi Ji? https://t.co/cdDHrAZ8QL pic.twitter.com/5Ly2mTOgpz
">While scumbags like @revanth_anumula need not be responded to; it’s important to expose filth
— KTR (@KTRTRS) September 16, 2021
Here’s his audio clip/comments on Tharoor. Sent to me by a reporter
I am sure if we send it to a forensic lab, it’ll match his infamous #Note4Vote voice
Any comments @RahulGandhi Ji? https://t.co/cdDHrAZ8QL pic.twitter.com/5Ly2mTOgpzWhile scumbags like @revanth_anumula need not be responded to; it’s important to expose filth
— KTR (@KTRTRS) September 16, 2021
Here’s his audio clip/comments on Tharoor. Sent to me by a reporter
I am sure if we send it to a forensic lab, it’ll match his infamous #Note4Vote voice
Any comments @RahulGandhi Ji? https://t.co/cdDHrAZ8QL pic.twitter.com/5Ly2mTOgpz
సహచర ఎంపీ అయిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy).. శశిథరూర్‌పై అవమానకరంగా చిల్లర వ్యాఖ్యలు చేయడం దారుణమని మంత్రి కేటీఆర్ గురువారం ట్విటర్లో పేర్కొన్నారు. నేర చరిత్ర, స్వభావం ఉన్న వారు పార్టీకి నాయకత్వం వహిస్తే ఇలాగే ఉంటుందని తెలిపారు. థరూర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియోను ట్విటర్లో ఉంచారు. దీన్ని ఫోరెన్సిక్ విభానికి పంపిస్తే ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ గొంతుతో కచ్చితంగా సరిపోతుందని అన్నారు.
అది కచ్చితంగా జబ్బే..
-
Whole world knows that you are a pathological liar & suffering from antisocial personality disorder (ASPD). TS Govt is the swiftest in responding to crimes against women & children. Consult a psychiatrist & we bear your medical expenses. https://t.co/UskQVLRBEL
— Balka Suman (@balkasumantrs) September 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Whole world knows that you are a pathological liar & suffering from antisocial personality disorder (ASPD). TS Govt is the swiftest in responding to crimes against women & children. Consult a psychiatrist & we bear your medical expenses. https://t.co/UskQVLRBEL
— Balka Suman (@balkasumantrs) September 16, 2021Whole world knows that you are a pathological liar & suffering from antisocial personality disorder (ASPD). TS Govt is the swiftest in responding to crimes against women & children. Consult a psychiatrist & we bear your medical expenses. https://t.co/UskQVLRBEL
— Balka Suman (@balkasumantrs) September 16, 2021
థరూర్‌పై చేసిన వ్యాఖ్యల ద్వారా రేవంత్ రెడ్డి(Revanth reddy).. అబద్ధాలు, సంఘ వ్యతిరేక వ్యక్తిత్వం, క్రమశిక్షణ రాహిత్యమనే జబ్బుతో బాధ పడుతున్నారని ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. వెంటనే ఆయన చికిత్స కోసం మానసికి వైద్యుడి వద్దకు వెళ్లాలని సూచించారు. వైద్య ఖర్చులను తామే భరిస్తామని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
వీడియో ప్రూఫ్..
హైదరాబాద్‌లో పర్యటించిన శశిథరూర్... ఇక్కడి ఐటీ పాలసీపై, కేటీఆర్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఈ అంశంపై జాతీయ మీడియా ప్రతినిధులు టీపీసీసీ రేవంత్ రెడ్డి(Revanth reddy) దృష్టికి తీసుకురాగా.. వారి ముందు శశిథరూర్‌ను కించపరుస్తూ రేవంత్ వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. శశిథరూర్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌ను రేవంత్ రెడ్డి(Revanth reddy) ఖండించారు. కేటీఆర్ మాటలను నమ్మొద్దని థరూర్‌కి చెప్పారు. ఈ ట్వీట్‌కు కేటీఆర్ స్పందిస్తూ.. రేవంత్ నైజాన్ని బహిరంగపరిచేందుకే తాను ఈ అంశాన్ని లేవనెత్తానని.. శశిథరూర్‌ను కించపరుస్తూ తక్కువ చేసి మాట్లాడిన ఆడియో టేపును ట్వీట్‌కు జతచేశారు.
అధిష్ఠానం అసంతృప్తి..
రేవంత్ రెడ్డి.. సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతపై నోరు పారేసుకోవడం పట్ల జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి సీనియర్ నేత, అధిష్ఠానానికి అత్యంత దగ్గరైన మనీశ్ తివారి.. రేవంత్ రెడ్డి(Revanth reddy)వ్యాఖ్యలను ఖండించారు. ఈ క్రమంలో చివరకు రేవంత్ రెడ్డి శశిథరూర్‌కు ట్విటర్ వేదికగా క్షమాపణ చెప్పారు. దీనిపై సానుకూలంగా స్పందించిన థరూర్.. ఇక్కడితో వదిలేద్దాం కలిసి పనిచేద్దాం అని రీట్వీట్ చేశారు.
ఇదంతా గమనించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఇలాంటివి పునరావృతం కాకూడదని రేవంత్(Revanth reddy)కు సూచించారు. ఈనెల 17న జరిగే గజ్వేల్ సభలో కలుసుకుందాం అని ట్వీట్ చేశారు.