ఓ విశ్రాంత ఉద్యోగి రైలు ప్రయాణంలో గుండెపోటుతో మరణించారు. హన్మకొండకు చెందిన సోమయ్య పదేళ్ల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. వైద్య పరీక్షల్లో భాగంగా నిన్న నగరానికి వచ్చారు. వైద్య పరీక్షల అనంతరం అతను సొంతూరు వెళ్లడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కారు. రైలు మౌలాలి స్టేషన్ సమీపంలో ఉండగా సోమయ్యకు గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయారు.
తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌నకు సర్వం సిద్ధం