ETV Bharat / city

Consumer Court Verdict : పెళ్లి వీడియోలు ఇవ్వలేదని వీడియోగ్రాఫర్​కు జరిమానా

వివాహ వేడుక.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురఘట్టం. పెళ్లినాటి జ్ఞాపకాలను ఫొటోలు, వీడియోల రూపంలో బంధించి.. జీవితాంతం స్మరించుకోవాలనుకుంటారు. వీలుచిక్కినప్పుడల్లా.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వాటిని వీక్షిస్తారు. ఆనాటి ఆనంద సమయాలను.. నెమరువేసుకుని మురిసిపోతుంటారు. అలా.. తన తమ్ముడి పెళ్లికి సంబంధించిన గుర్తులను వీడియో, ఫొటోలను చూసుకునే అవకాశమివ్వకుండా.. ఇబ్బంది పెట్టిన ఓ వీడియోగ్రాఫర్​పై వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్​కు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

పెళ్లి వీడియోలు ఇవ్వలేదని వీడియోగ్రాఫర్​కు జరిమానా

author img

By

Published : Sep 4, 2021, 9:02 AM IST

పెళ్లి వేడుక ప్రతి ఒక్కరి జీవితంలోని ఓ అరుదైన ఘట్టం. జీవితాంతం ఆ మధుర జ్ఞాపకాలను నెమరువేసుకోవాలని అనుకునేవారు కోకొల్లలు. వీలు దొరికినప్పుడల్లా, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పెళ్లి ఆల్బమ్, వీడియోలను చూసుకుంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ మురిసిపోతుంటారు. అయితే ఆ అవకాశం ఇవ్వకుండా పెళ్లి ఆల్బమ్, వీడియో ఇవ్వకుండా మానసికంగా ఇబ్బంది పెట్టాడంటూ ఓ వ్యక్తి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. విచారించిన రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ వీడియోగ్రాఫర్‌కు రూ.25వేల జరిమానా విధించింది.

హైదరాబాద్​లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన నవీన్‌రెడ్డి తన సోదరుడి వివాహం, రిసెప్షన్, పెళ్లికుమారుడిని చేయడం, సత్యనారాయణ వ్రతం వేడుకలకు సంబంధించిన వీడియో, ఫొటోలు తీసేందుకు వరంగల్‌కు చెందిన ఎం.హరిక్రిష్ణతో రూ.1.25లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.60వేలు చెల్లించారు. పెళ్లి వేడుక ముగిశాక మిగిలిన డబ్బులు చెల్లించి ఆల్బమ్, వీడియోల సాఫ్ట్ కాపీలు తీసుకుంటానని చెప్పారు.

వేడుక ముగిసిన ఒక నెల తర్వాత దీని కోసం ఆరా తీయగా హరిక్రిష్ణ ఎడిటింగ్‌ కోసం మరికొంత సమయం కావాలని అభ్యర్థించారు. ఇలా 22 నెలలు గడిచినా వాటిని ఇవ్వకపోవడంతో నవీన్.. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కమిషన్‌ బెంచ్‌ ఫిర్యాదిదారుడికి పరిహారంగా రూ.20వేలు, కేసు ఖర్చులు రూ.5వేలు చెల్లించాలని రూ.40వేలు తీసుకుని వీడియోలు, ఫొటో ఆల్బమ్‌ ఇచ్చేయాలని హరిక్రిష్ణను ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.