ETV Bharat / city

Hyderabadi Haleem : వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ హలీమ్.. తింటే వదలరంతే! - హలీమ్ తయారీ

Hyderabadi Haleem : హలీమ్‌.. ఈ పేరు వింటే చాలు ప్రతి ఒక్కరికీ నోరూరాల్సిందే. నవాబుల డైనింగ్ టైబుల్ మీద ఒకప్పుడు గర్వంగా నిలిచిన హలీమ్‌.. ఇప్పుడు గరీబులకూ ఫేవరెట్ డిష్‌గా మారింది. అంతేకాదు రుచిలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న హలీమ్‌... జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌ని కూడా సొంతం చేసుకుంది. మాంసంతో తయారయ్యే ఈ హలీమ్‌.. ఇప్పుడు శాఖాహారంతో ప్రత్యేక రుచిని సంపాదించుకుంటూ వెజిటేరియన్స్‌కి చేరువైంది. రుచిలో మాత్రమే కాదు.. పోషకాల్లోనూ హలీమ్‌ది అగ్రస్థానమే. ఇందులో ఉండే ప్రొటీన్లు మరెందులోనూ ఉండవంటే అతిశయోక్తికాదు. ఇంతలా ఊరిస్తున్న హలీమ్‌ విశేషాలేంటో చూద్దాం పదండి.

Hyderabadi Haleem
Hyderabadi Haleem
author img

By

Published : Apr 23, 2022, 4:28 PM IST

వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ హలీమ్.. తింటే వదలరంతే

Hyderabadi Haleem : హలీమ్‌, హరీస్ పేరేదైనా రుచి మాత్రం ఒక్కటే. ఎవరినైనా లొట్టలేసేలా చేస్తుంది. రుచి చూడాలని మనసు తహతహలాడేలా చేస్తుంది. అందుకే చిన్నా పెద్దా అంతా హలీమ్‌ని ఆబగా లాగించేస్తారు. అంతలా ఆకర్షిస్తుంది మరి. హలీమ్‌ పుట్టినిల్లుగా చరిత్రకారులు హైదరాబాద్‌నే చెబుతారు. మొఘల్ చక్రవర్తుల కాలంలో మన దేశంలోకి అడుగుపెట్టిన హలీమ్‌కు పెద్దపీట వేసింది మాత్రం నిజాం ప్రభువులే. అత్యంత శక్తివంతమైన పదార్థం, ఇంకా రుచికరమైంది కావటంతో హలీమ్‌ని నిజాం ప్రభువులు ఎంతో ప్రీతిపాత్రంగా భావించేవారు. తర్వాత మన పాక శాస్త్ర నిపుణులు.... హైదరాబాద్‌లో ప్రత్యేకంగా లభించే కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు జోడించి సాధారణ ప్రజలకు దీన్ని రుచి చూపించారు.

నిజాం నవాబ్ నుంచి మన ఇంటికి : అలా.. నిజాం నవాబుల డైనింగ్ డేబుల్ మీద ఎంతో సగర్వంగా నిల్చిన హలీమ్‌... మదీనా హోటల్ పుణ్యమా అని సాధారణ ప్రజల ప్లేట్లలోకి వచ్చి చేరింది. హైదరాబాద్‌లో తయారయ్యే హలీమ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఇక్కడ తయారైన హలీమ్‌ను మలేషియా, సింగపూర్‌, సౌదీ అరేబియా దేశాల వారు ప్రత్యేకంగా ఆర్డర్లిచ్చి తీసుకెళ్తుంటారు. ప్రపంచంలోని సుమారు అన్ని దేశాలకు మన హైదరాబాద్ హలీమ్‌ ఎక్స్ పోర్ట్ అవుతుందనటంలో అతిశయోక్తి లేదు. రంజాన్ మాసంలో ఎక్కువ తయారయ్యే హలీమ్‌.. ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 6000 చోట్ల అమ్మకాలు జరుగుతుంటాయి. వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. వేల మందికి ఉపాధి కూడా దొరుకుతుందంటే మన హలీమ్‌కి ఉన్న క్రేజేంటో మీరే అర్థం చేసుకోవచ్చు.

హలీమ్ తయారీ ఎలా అంటే : హలీమ్‌ రుచి మాత్రమే కాదు తయారీ ప్రత్యేకమైనదే. దాదాపు 12 గంటల పాటు ఉడకబెట్టి దీన్ని తయారు చేస్తారు. మాంసంతో పాటు.. తగినన్ని పచ్చి మిరపకాయలను ఓ పెద్ద పాత్రలో వేసి మూత పెట్టి మందంగా ఉన్న జనపనార సంచిని గుడ్రంగా చుట్టి మూత చుట్టూ ఉంచుతారు. ఆవిరి బయటికి పోకుండా ఉండి... మాంసం చక్కగా ఉడుకుంది. ఇక మాంసం, పచ్చిమిరపకాయలు బాగా ఉడికిన తర్వాత దానిలో ఉడకబెట్టిన పప్పులు, రవ్వా కలిపి మరికాసేపు ఉడకనిస్తారు. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, సాజీరా, యాలకులు, లవంగాలు, మిరియాలు, తోకమిరియాలు, దాల్చిన చెక్క, ఉప్పు, గులాబీ రేకులను ముందుగానే కలిపి ఉంచుకుని వాటిని ఉడుకుతున్న మాంసంలో వేసి బాగా కలిపేస్తారు. ఆ తర్వాత మరో గంట సేపు ఈ మాంసాహారాన్ని ఆవిరి మీద ఉడకనిస్తారు. ఇలా దమ్ పట్టి, మసాలా దినుసులతో ఉడికిన మాంసాన్ని బాగా కలుపుతారు. దీనినే గోటా కొట్టడం అంటారు. ఇలా కలపడం వల్ల మాంసానికి సుగంధ ద్రవ్యాలు బాగా పట్టి.. మంచి సువాసనతోపాటు... రుచి వస్తుందని చెబుతారు తయారీదారులు. కందిపప్పు, మినప్పప్పు, ఎర్రపప్పు బాగా ఉడికించిన మిశ్రమాన్ని గోటా సమయంలోనే మాంసానికి జతచేస్తారు. ఇవన్నీ కలిపి గోటా పూర్తి చేస్తే.. పసందైన హలీమ్‌ రెడీ అయినట్టే. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది.

వెజ్ హలీమ్ : ఇలా తయారైన వేడి వేడి హలీమ్‌లో చక్కగా నెయ్యి వేసుకుంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. హలీమ్‌లో మాంసం, పప్పులు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, గోధుమలు ఉంటాయి. ఇవన్నీ ఉదయం నుంచి రోజా ఉన్న వారి శరీరానికి కావాల్సిన పూర్తి పోషకాలను త్వరగా ఇవ్వగలవు. అంతేకాదు....సుమారు 12 గంటల వరకు హలీమ్‌ను బాగా ఉడికించి తయారు చేయటం వల్ల.... తర్వగా జీర్ణం అవుతుంది. శాకాహారుల కోసం వెజ్ హలీమ్‌ కూడా అందుబాటులోకి రావటంతో హలీమ్‌కి ఉన్న గిరాకీ మరింత పెరిగింది.

దటీజ్ హైదరాబాద్ హలీమ్ : ఇంత రుచి కరమైంది కాబట్టే ఎంతో ప్రత్యేకమైన వాటికి మాత్రమే దక్కే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌ని సొంతం చేసుకుంది మన హైదరాబాదీ హలీమ్‌. ఒక ప్రాంతంలో దొరికే పదార్థం దానికదే సాటి అని నిరూపించుకున్న వాటికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం అది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్ వారు మన హలీమ్‌కు 2010లో ఈ ట్యాగ్‌ని ఇచ్చారు. ఎన్నో అనుబంధాలను , అనురాగాలను , ఆత్మీయతను సంపాదించుకుంది మన హైదరాబాద్ హలీమ్. నవాబుల నుంచి గరీబులకు పరిచయమై.. హిందూ ముస్లిం అని తేడా లేకుండా అందర్నీ తన గులామ్‌లుగా మార్చుకున్న హైదరాబాద్ హలీమ్‌ను మీరు రుచి చూసేయండి మరి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.