ETV Bharat / city

ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు - అచ్చెన్నాయుడు అరెస్టుపై రామ్మోహన్ నాయుడు స్పందన

ఏపీ ప్రభుత్వంపై తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంవత్సరం పాటు ఫ్యాక్షన్‌ రాజకీయాలు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజల మద్దతున్న అచ్చెన్నాయుడిపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అసలు నిజమేంటో బయటికొస్తుందని స్పష్టం చేశారు.

ram-mohan-naidu-fires-on-ycp-government-and-condemn-the-atchennaidu-arrest
ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు
author img

By

Published : Jun 12, 2020, 7:30 PM IST

ప్రతిపక్షమే లేకుండా చేయాలని వైకాపా నేతలు ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు దుయ్యబట్టారు. సంవత్సరంపాటు ఫ్యాక్షన్‌ రాజకీయాలు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. అచ్చెన్నాయుడు అరెస్టుపై శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల మద్దతున్న నాయకుడిపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు.

'‌నవరత్నాలు అంటూ ప్రజలకు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారు. వాటిల్లో ఒక్కటన్నా సక్రమంగా అమలు చేశారా?. ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన జరిగితే స్థానికులను రోడ్లపై పడేశారు. ఎన్నో పథకాలను తెదేపా ప్రారంభించిందనే కారణంతో ఆపేశారు. మేము చెప్పింది నవరత్నాలే.. అవే చేస్తామంటున్నారు. ఆ నవరత్నాలను అయినా సక్రమంగా అమలు చేస్తున్నారా?' అని రామ్మోహన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

'మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధరతో మందులు కొనుగోలు చేసింది మన రాష్ట్రమే. ఒక విభాగంలో పొరపాటు జరిగితే ఒక పద్ధతిలో వెళ్లాలి. సెక్షన్‌ అధికారి నుంచి ఒక్కొక్కరిని విచారిస్తూ చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం అలా వ్యవహరించట్లేదు. మా కుటుంబం మొత్తం నీతికి, నిజాయితీకి కట్టుబడి సేవలు అందిస్తోంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అసలు నిజమేంటో బయటికొస్తుంది. సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న వ్యక్తిని కారణం లేకుండా అరెస్టు చేశారు. ఐదు గంటలుగా అసలు అచ్చెన్నాయుడు ఎక్కడ ఉన్నారో చెప్పడం లేదు. అన్ని విధాలుగా న్యాయ పోరాటం చేస్తాం' అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.