కరోనా నియంత్రణలో భారత్ సఫలీకృతమైందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. కేంద్రం చూపించిన.. శ్రద్ధ రాష్ట్రాలు చూపిస్తేనే కరోనాను పూర్తిగా అరికట్టగలమని అభిప్రాయపడ్డారు. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, అసమర్థ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. సగం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప...కేసీఆర్ చూపించడానికి మరేమీ లేదని ఎద్దేవా చేశారు.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల నేతలు, కార్యకర్తలతో జన్సంవాద్ వర్చువల్ సభ నిర్వహించారు. దేశ సమగ్రత, మహిళల హక్కులు, రైతుల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ అనేక సంస్కరణలు తెచ్చారని కొనియాడారు.
ఇవీచూడండి: వైద్యులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు: గవర్నర్