ETV Bharat / city

'అధ్యాపకులు లేక వైద్య సీట్లు కోల్పోయే పరిస్థితి ఉండకూడదు' - అసెంబ్లీలో హరీశ్​ రావు స్పీచ్

అధ్యాపకులు లేక రాష్ట్రం... వైద్య సీట్లు కోల్పోయే పరిస్థితి ఉండకూడదని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. వైద్య సీట్లు కోల్పోతే రాష్ట్రానికి, విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. వైద్య విద్యార్థులపై ప్రభావం లేకుండా బోధనా సిబ్బంది వయో పరిమితి మాత్రమే పెంచుతున్నామని స్పష్టం చేశారు. వైద్య కళాశాలల్లో అధ్యాపకుల వయోపరిమితిని పెంచుతూ శాసనసభలో బిల్లు పెట్టారు.

harish rao
harish rao
author img

By

Published : Sep 14, 2020, 2:28 PM IST

వైద్య కళాశాలల్లో నిపుణుల కొరత దృష్ట్యా అధ్యాపకుల వయో పరిమితిని పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వైద్య కళాశాలల్లో అధ్యాపకుల వయోపరిమితిని పెంచుతూ అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అధ్యాపకుల వయోపరిమితి 58 నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా 52 మంది ప్రొఫెసర్లను కొనసాగించే అవకాశం ఉంటుందన్నారు. అనుభవజ్ఞుల సేవలు వినియోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు వైద్య సేవలు, వైద్య విద్యార్థులపై ప్రభావం పడకూడదనేది ప్రభుత్వ ఉద్దేశమని వెల్లడించారు.

అధ్యాపకుల నియామకాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని తెలిపారు. వైద్య కళాశాలల్లో అధ్యాపకులు, వసతులపై ఏటా తనిఖీలు జరుగుతాయని చెప్పారు. వైద్య కళాశాలల్లో ఏటా బోధనా సిబ్బంది పదవీ విరమణ చేస్తున్నారని... అధ్యాపకులు లేక రాష్ట్రం వైద్య సీట్లు కోల్పోయే పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు. వైద్య సీట్లు కోల్పోతే రాష్ట్రానికి, విద్యార్థులకు నష్టం జరుగుతుందని వివరించారు. వైద్య విద్యార్థులపై ప్రభావం లేకుండా బోధనా సిబ్బంది వయో పరిమితి మాత్రమే పెంచుతున్నామని స్పష్టం చేశారు. బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.

'అధ్యాపకులు లేక వైద్య సీట్లు కోల్పోయే పరిస్థితి ఉండకూడదు'

ఇదీ చదవండి: కొత్త రెవెన్యూ బిల్లును మండలిలో ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.