హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు జల్లులు కురిశాయి. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, ఎర్రగడ్డ, సనత్‌నగర్, పంజాగుట్ట, చింతల్ బస్తీ ప్రాంతాల్లో వానపడింది.
ముషీరాబాద్, రాంనగర్, కవాడిగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్, విద్యానగర్, గాంధీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు, పాదచారులు అవస్థలు పడ్డారు.
ఇవీచూడండి: హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పు