ETV Bharat / city

సుప్రీంలో రఘురామ కుమారుడి రిట్‌ పిటిషన్‌..! - ఎంపీ రఘురామకృష్ణరాజు కేసు

ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీం ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల నివేదిక ..ఇప్పటికే సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు అందింది. బెయిల్‌ కోరుతూ రఘురామ, తన తండ్రికి ప్రాణహాని ఉందని, వైద్యం అందించేలా ఆదేశించాలని ఆయన కుమారుడు భరత్‌ వేసిన పిటిషన్లను జస్టిస్ వనీత్‌ శరన్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ల ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే రఘురామ బెయిల్‌ పిటిషన్‌ వ్యతిరేకిస్తూ కౌంటర్‌ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం ఆయన్ని పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఆర్మీ ఆసుపత్రి వైద్య నివేదికను పరిశీలించిన తర్వాత... సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించే అవకాశం ఉంది

ap mp raghurama, ap mp raghurama case, supreme court
ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసు, ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వివాదం
author img

By

Published : May 21, 2021, 10:35 AM IST

సిట్టింగ్‌ ఎంపీని పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన సీఐడీ పోలీసుల తీరుపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు కనుమూరు భరత్‌ గురువారం రాత్రి సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలుచేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేతిలో పోలీసు యంత్రాంగం ఉన్నందున అక్కడ తమకు న్యాయం జరిగే పరిస్థితి లేదని, ఈ మొత్తం ఘటనపై సీబీఐ.. లేదా కోర్టు ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని కోరారు. తన తండ్రిపై జరిగిన చిత్రహింసల విచారణకు ఏర్పాటుచేసిన మెడికల్‌ బోర్డులో సభ్యురాలైన గుంటూరు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ స్థానిక న్యాయవాది భార్య అని, ఆమె భర్త వైకాపా లీగల్‌ సభ్యుడిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆమె ఇచ్చిన నివేదికలో ఎక్కడా వైద్యపరిభాష లేదని, వాస్తవాలను అందులో పొందుపరచలేదని పేర్కొన్నారు. స్వతంత్ర దర్యాప్తుతోనే నిజాలు బయటపడతాయన్నారు. ఇందులో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌తోపాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌, అదనపు ఎస్పీ ఆర్‌ విజయపాల్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. ముఖ్యమంత్రి ఎజెండాను ప్రశ్నిస్తున్నందుకే తన తండ్రిపై కక్షకట్టినట్లు పేర్కొన్నారు.

రిట్‌ పిటిషన్‌లో పేర్కొన్న ఇతర వివరాలు ఇలా ఉన్నాయి...

రఘురామకృష్ణరాజు వైకాపా నుంచి ఎంపీగా ఎన్నికైనా.. ఆ పార్టీ అధ్యక్షుడి ప్రజా వ్యతిరేక అజెండాను వ్యతిరేకిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆయన ప్రజల గొంతును వినిపించడంతోపాటు, జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వ విధానంపట్ల విమర్శనాత్మకంగా ఉన్నారు. ఆయన సొంత కులం, మతానికి చెందిన వ్యక్తులను మాత్రమే ప్రోత్సహించడాన్ని తప్పుబట్టారు.

  • 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకల్లా వైద్యపరీక్షల నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశిస్తే ఆ సమయానికి మెడికల్‌ బోర్డు కనీసం ఆ పని కూడా ప్రారంభించలేదని చెప్పారు. కాళ్లపై తగిలిన దెబ్బలు తగ్గిపోవాలనే జాప్యం చేశారు. రాత్రి వైద్య సేవలు కూడా అందించలేదు. వైద్యపరీక్షల సమయంలో ఎక్స్‌రేలు, ఎంఆర్‌ఐ స్కాన్‌ తీయలేదు. కనిపించే గాయాలను నిర్ధారించడానికి ఆ సమయంలో ఆర్థోపెడిక్‌, ఫోరెన్సిక్‌ స్పెషలిస్టులను కూడా తీసుకురాలేదు. 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సునీల్‌కుమార్‌ ఆసుపత్రికి వచ్చి మా తండ్రిని చూశారు. అలాగే మెడికల్‌ బోర్డు సభ్యులను కలిసి వారితో చర్చించారు. చిత్రహింసలు జరగలేదని చెబుతూ మెడికల్‌ బోర్డు నివేదిక ఇచ్చేలా చూడటానికే ఆయన అక్కడికొచ్చినట్లు కనిపిస్తోంది. పోలీసు అధికారి అయిన సునీల్‌కుమార్‌ జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న రాజును కలవలేదు. మొత్తం ఎపిసోడ్‌లో ఆయన క్రియాశీలక పాత్రకు ఇది అద్దం పడుతోంది. మేజిస్ట్రేట్‌కు సమాచారం అందించకుండా పరీక్షలు అవ్వగానే మా తండ్రిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రమేష్‌ ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలన్న మేజిస్ట్రేట్‌ ఆదేశాలను బేఖాతరు చేశారు. మేజిస్ట్రేట్‌ ఆర్డర్‌ను అమలుచేయాలని హైకోర్టు చెప్పినా వినిపించుకోలేదు.
  • ఈనెల 14న నా తండ్రి పుట్టినరోజు వేడుకల సమయంలో పోలీసులుగా చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు ఎలాంటి గుర్తింపుకార్డులు, వారెంట్‌ లేకుండానే బలవంతంగా కారెక్కించారు. మీడియా ప్రతినిధులు చూస్తుండగానే దురుసుగా ప్రవర్తిస్తూ బలవంతంగా కారులోకి నెట్టేశారు. పోలీసులు ఎలాంటి నోటీసులు జారీచేయలేదు. కానీ మా తండ్రిని అరెస్ట్‌ చేసి తీసుకెళ్తున్నప్పుడు నోటీసును గోడకు అతికించారు. ఆ దృశ్యాలు అన్నీ మీడియాలో నిక్షిప్తమయ్యాయి. ఆ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే ఆ నోటీసును చించేసి వెళ్లిపోయారు.
  • పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులను విచక్షణారహితంగా అరెస్టు చేసి భయపెడుతున్న విషయం గురించి ప్రజలకు చెబుతున్నందుకు తన తండ్రిపై కక్షకట్టారు. సీఐడీ ఏడీజీ కూడా ముఖ్యమంత్రి చెప్పినట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి అనుచరుల నుంచి నేరుగా నివేదికలు అందుకుంటూ ఒక సామాజిక వర్గానికి, ప్రత్యర్థి రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టి విచక్షణారహితంగా సోదాలు, అరెస్టులు చేస్తున్నారు.
  • సిట్టింగ్‌ ఎంపీని పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం పౌరసమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశం. ముఖ్యమంత్రి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వై కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తినే దారుణంగా హింసించారు. నిబంధనలు పాటించకుండా మోసపూరితంగా అరెస్టుచేసి దారుణంగా వాహనంలో కుక్కి తరలించారు. మా తండ్రి గత డిసెంబరులో గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలిసీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఇలా వ్యవహరించారు. ఆయన కరోనాకు గురై పదిరోజుల క్రితమే కోలుకున్నారు. ఆలాంటి సమయంలోనూ ఆయనకు వైద్యపరీక్షలు చేయించలేదు. కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ పాటించలేదు. కోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పాటుచేయించి విచారణ జరిపించాలి అని కోరారు.

లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన రఘురామ కుటుంబ సభ్యులు

ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు గురువారం లోక్‌సభ సభాపతి ఓంబిర్లా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసినట్లు సమాచారం. ఎంపీ సతీమణి రమ, కుమారుడు భరత్‌, కుమార్తె ఇందు ప్రియదర్శిని వారిని కలిసి రఘురామ అరెస్టు, కస్టడీలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఎంపీ అరెస్టు తర్వాత ఘటనలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు తెలియజేసిన అంశాలనూ వారిద్దరికి వివరించినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.