ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మన్యంలో ఓ భారీ కొండచిలువ స్వేచ్ఛగా విహరిస్తూ స్థానికుల కనిపించింది. రాజవొమ్మంగి మండలం దూసరపాము నుంచి లబ్బర్తి వెళ్లే రహదారిలో చిట్రోలుబోదు కాల్వ వద్ద కొండచిలువ చిమ్మచీకట్లో సంచరిస్తోంది.
దారినవెళ్లే వారు సెల్‌ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. నీటిలోనూ ఆ భారీ కొండచిలువ ఈదుకుంటూ వెళ్తోంది. రాజవొమ్మంగి మండలంలో అప్పుడప్పుడు కొండచిలువలు హడావిడి చేస్తున్నాయి. ఇలా అప్పుడప్పుడు కొండచిలువలు జనావాసాల్లోనూ దర్శనమివ్వడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఇదీ చూడండి : సీఎం ఎప్పుడు ప్రగతిభవన్ వస్తారో ఆయనకే తెలియదు: విజయశాంతి