ETV Bharat / city

తెలంగాణ ప్రజలకు రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు - telangana formation day 2020

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో తెలంగాణ ముఖ్య భూమిక పోషిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతి, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్‌ చేశారు.

Telangana statehood day
Telangana statehood day
author img

By

Published : Jun 2, 2020, 11:04 AM IST

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, చిరంజీవి, పవన్​ కల్యాణ్​ శుభాకాంక్షలు తెలిపారు. యావత్ దేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగువారి సొంతమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ట్వీట్ చేశారు. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు... దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్‌ దిశగా... అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోవింద్‌ ఆకాంక్షించారు.

  • తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం!

    తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

    యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం.

    — President of India (@rashtrapatibhvn) June 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఘనమైన చరిత్ర, సహజవనరులతో భినత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింభిస్తున్న తెలంగాణ... వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తోందనని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ దిశగా మరింత సమృద్ధిని సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

  • తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, సహజవనరులతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ.. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తూ.. మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. #Telangana pic.twitter.com/zsTM3HemRF

    — Vice President of India (@VPSecretariat) June 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలంగాణ అవతర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎన్నో రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు. దేశ ప్రగతిలో తెలంగాణ ముఖ్య భూమిక పోషిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతి, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్‌ చేశారు.

  • తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను.

    — Narendra Modi (@narendramodi) June 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్ర ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా... దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత కేసీఆర్​కు, తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చిరు ట్వీట్ చేశారు.

  • ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా,దశాబ్దాల కల సాకారం చేసిన
    జన హృదయ నేత శ్రీ KCR గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు
    బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.💐

    — Chiranjeevi Konidela (@KChiruTweets) June 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జనసేన అధినేత పవన్​ కల్యాణ్​... తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి శుభాకాంక్షల వెల్లువ

ఇదీ చదవండి: జయహో తెలంగాణ.. అమరులకు సీఎం నివాళులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.