మంత్రి గౌతంరెడ్డి హఠాన్మరణం.. తనను తీవ్రంగా కలచి వేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దశాబ్దాలుగా మేకపాటి కుటుంబంతో ఉన్న అనుబంధం ఎన్నటికీ మరువలేనిదని, గౌతమ్ రెడ్డి వంటి యువనేత ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తమ సహచరుల్లో ముఖ్యమంత్రి జగన్‌కు ఎంతో ఇష్టమైన, సన్నిహితుడైన గౌతం రెడ్డి... రాష్ట్ర పారిశ్రామిక, నైపుణ్యభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులు, మంచి పేరు ప్రఖ్యాతులు, అవార్డులు తీసుకు రావడం వెనక గౌతంరెడ్డి విశేషమైన కృషి దాగి ఉందని గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి లేనిలోటు ఎవరూ తీర్చలేనిదని... ఆయన ఆత్మకు శాంతి కలగాలన్న కృష్ణదాస్... కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కఠిన వ్యాయామాలు చేసేవారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
- కోపం తెచ్చుకున్న సందర్భాలు నేను చూడలేదు: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
- గౌతమ్‌రెడ్డి కఠిన వ్యాయామాలు చేసేవారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
- గౌతమ్‌రెడ్డి ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవారు: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
- కోపం తెచ్చుకున్న సందర్భాలు నేను చూడలేదు: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
గౌతమ్‌రెడ్డి వివాద రహితుడు: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
- గౌతమ్‌రెడ్డి ఇకలేరన్న వార్త నన్ను చాలా బాధించింది: సోమిరెడ్డి
- చిన్నవయస్సులోనే చనిపోవడం చాలా బాధ కలిగించింది: సోమిరెడ్డి
- గౌతమ్‌రెడ్డి నాకు బంధువు: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
- నా బంధువు నిశ్చితార్థ కార్యక్రమంలో రాత్రే కలిశా: సోమిరెడ్డి
- మచ్చలేకుండా మంత్రిగా పనిచేశారు: సోమిరెడ్డి
- గౌతమ్‌రెడ్డి వివాద రహితుడు: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
కన్నీటిపర్యంతమవుతున్న అభిమానులు
- నెల్లూరు: అత్మకూరులోని గౌతమ్‌రెడ్డి కార్యాలయం వద్ద విషాదఛాయలు
- కార్యాలయం వద్దకు భారీగా చేరుకుంటున్న వైకాపా కార్యకర్తలు, అభిమానులు
- మంత్రి ఇకలేరని అత్మకూరులో కన్నీటిపర్యంతమవుతున్న అభిమానులు
మంచి స్నేహితుడు.. అన్నను కోల్పోయా: మంత్రి అనిల్‌కుమార్
- గౌతమ్‌రెడ్డి మృతి వార్త విని హైదరాబాద్ చేరుకున్న మంత్రి అనిల్
- గౌతమ్‌రెడ్డి మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి అనిల్‌కుమార్ యాదవ్
- మంచి స్నేహితుడు.. అన్నను కోల్పోయా: మంత్రి అనిల్‌కుమార్
చిన్న వయస్సులోనే మనల్ని వదిలి వెళ్లడం బాధాకరం: మంత్రి పెద్దిరెడ్డి
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే గౌతమ్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త అమితంగా బాధించిందన్నారు. చిన్న వయస్సులోనే గౌతంరెడ్డి మనల్ని వదిలి వెళ్ళడం బాధాకరమన్నారు. మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారన్న పెద్దిరెడ్డి... నిన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. గౌతంరెడ్డి అధ్వర్యంలో రాష్ట్ర పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధించిందన్నారు. మేకపాటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పెద్దిరెడ్డి... గౌతమ్ రెడ్డి మరణం వైకాపాకు, రాష్ట్రానికి తీరని లోటని తెలిపారు.
చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరం: ఆనం రాంనారాయణరెడ్డి
- గౌతమ్‌రెడ్డి మృతి వార్త విని చాలా బాధపడ్డా: ఆనం రాంనారాయణరెడ్డి
- వివాద రహిత మంత్రిగా పనిచేశారు: ఆనం రాంనారాయణరెడ్డి
- వయస్సులో మాకంటే చిన్నవాడైనా గొప్ప పేరు తెచ్చుకున్నారు: ఆనం
- చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరం: ఆనం రాంనారాయణరెడ్డి
- నెల్లూరు జిల్లాకు ఎన్నో పరిశ్రమలు తీసుకురావాలని తపించారు: ఆనం
గౌతమ్‌రెడ్డి చాలా సరదాగా మాట్లాడుతుండేవారు: మంత్రి బాలినేని
- గౌతమ్‌రెడ్డి మృతి పట్ల మంత్రి బాలినేని దిగ్భ్రాంతి
- గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యుడిగా ఉండేవారు: మంత్రి బాలినేని
- గౌతమ్‌రెడ్డి చాలా సరదాగా మాట్లాడుతుండేవారు: మంత్రి బాలినేని
- గౌతమ్‌రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు: మంత్రి బాలినేని