ETV Bharat / city

AUGUST 15TH: స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్​ కోసం పోలీసుల రిహార్సల్స్.. - AUGUST 15TH police pared

పంద్రాగస్టు పరేడ్​ కోసం పోలీసులు సన్నద్ధమవుతున్నారు. నాలుగురోజులుగా రిహార్సల్స్​ చేస్తూ.. స్వాతంత్య్ర దినోత్సవం రోజు పరేడ్​ కోసం సిద్ధమవుతున్నారు. ఈసారి కొత్తవాళ్లతో పరేడ్​ నిర్వహిస్తుండగా... పూర్తి సన్నద్ధతతో ఉండేలా రిహార్సల్స్​ నిర్వహిస్తున్నారు.

police pared final practice in golkonda port

author img

By

Published : Aug 13, 2021, 8:14 PM IST

Updated : Aug 13, 2021, 10:08 PM IST

స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్​ కోసం పోలీసుల రిహార్సల్స్..

గోల్కొండ కోటలో ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్, జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ తెలిపారు. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని నిర్వహించే పరేడ్ రిహార్సల్​ను గోల్కొండలో నిర్వహించారు. సీఎం కాన్వాయ్ రిహార్సల్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్, అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబవుతోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండపై జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అందుకనుగుణంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కోట ప్రాంగణంలో సఫాయి కార్మికులు పారిశుద్ధ్య పనులను పూర్తి చేశారు. వేడుకల సందర్భంగా పోలీసులు పరేడ్ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ప్రాంగణానికి చేరుకున్న తర్వాత పోలీసులు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత సీఎం గౌరవ వందనం స్వీకరిస్తారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసులు పరేడ్ నిర్వహిస్తారు. పరేడ్ కోసం గోల్కొండ ప్రాంగణంలో నాలుగు రోజులుగా పోలీసులు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు.

ఈ సారి కొత్తవాళ్లతో కవాతు నిర్వహిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పూర్తి సన్నద్ధతతో ఉండేలా రిహార్సల్స్​ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

ఇదీ చూడండి:

Last Updated : Aug 13, 2021, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.