ETV Bharat / city

TIRUMALA: తిరుమలకు మద్యం సేవించి వచ్చిన యాత్రికులు.. - latest news in thirumala

తిరుమలకు మద్యం(DRUNKERS) సేవిస్తూ వచ్చిన యాత్రికులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నాగాలాండ్​కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారి వద్ద నుంచి మద్యం సీసా, గుట్కా(GUTKA PACKETS) ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

police-arrested-drunked-persons-at-thirumala-ghat-road
తిరుమలకు మద్యం సేవించి వచ్చిన యాత్రికులు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
author img

By

Published : Jul 14, 2021, 1:02 PM IST

Updated : Jul 14, 2021, 2:16 PM IST

నాగాలాండ్​కు చెందిన కొందరు యాత్రికులు సొంత వాహనంలో తిరుమలకు వచ్చారు. అలిపిరిలో తనిఖీ పూర్తయిన తరువాత.. కొండపైకి పయనమయ్యారు. కనుమ దారిలో వస్తున్న సమయంలో కారులో మద్యం సేవిస్తూ వచ్చారు. గమనించిన ఇతర భక్తులు అక్కడి సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

జీఎన్సీ టోల్‌గేట్ వద్ద వాహనాన్ని ఆపి సిబ్బంది తనిఖీ చేశారు. కారులోని మద్యం సీసా, గుట్కా ప్యాకెట్లను గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత వస్తువులతో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి.. కొండపైకి రావడంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి: Viral Video: వర్షం నీటిలో చిట్టి సింహం సరదా ఆటలు

Last Updated : Jul 14, 2021, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.